నితీష్ సంచలన నిర్ణయం…బీహార్ లో మళ్లీ కంప్లీట్ లాక్ డౌన్

బీహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో మరోసారి పూర్తి లాక్ డౌన్ విధించాలని నితీష్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. జులై-16 నుంచి జులై-31వరకు రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర సేవలు మినహా స్కూల్స్,కాలేజీలు,ప్రార్ధన మందిరాలు,షాపులు,మాల్స్ మూసివేయబడతాయని నితీష్ ప్రభుత్వం ప్రకటించింది.

మంగళవారం సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన హై లెవెల్ కేబినెట్ మీటింగ్ లో ఈ కంప్లీట్ లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నట్లు బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ తెలిపారు. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు జులై-16నుంచి జులై 31వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తున్నట్లు చెప్పారు. లాక్ డౌన్ కి సంబందించిన గైడ్ లైన్స్ సిద్దమవుతున్నట్లు అయన తెలిపారు.

బీహార్‌లో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 38 జిల్లాల్లో కొత్తగా 1432  కరోనా ఇన్‌ఫెక్షన్లను గుర్తించినట్లు బీహార్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 18,853కు చేరుకోగా ,ఇప్పటివరకు 12,364మంది కోలుకున్నారు.