Bihar Groom Breaks Dhanush
Bihar groom breaks dhanush Swayamvaram : రామాయణంలో శ్రీరామ చంద్రుడు శివ ధనస్సు విరిచి సీతమ్మ మెడలో మాల వేసి వివాహం చేసుకున్నాడని పురాణాల్లో చదువుకున్నాం. రామాయణంలో అదొక అత్యద్భుతమైన ఘట్టం. కానీ ఈరోజుల్లో అటువంటివి జరుగుతాయా? అంటే అబ్బే..అంటాం. కానీ ఓ వరుడు అచ్చంగా రాముడిలా ధనస్సు విరిచి వధువు మెడలో వరమాల వేసి వివాహం చేసుకున్నాడు. ఈ వింత వివాహం బీహార్‌లోని సరణ్ జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతే మరి వినూత్నంగా ఏది జరిగినా వైరల్ కావటం ఈ సోషల్ మీడియా రోజుల్లో సర్వసాధారణంగా మారిపోయాయి. హా..ధనస్సు విరిచిన వరుడు కథకొస్తే..
సరణ్ జిల్లాలోని సోన్ పూర్ బ్లాక్ పరిధిలోని సబల్ పూర్ ఈస్ట్ ఏరియాలో ఈ వింత వివాహం జరిగింది. వరుడు శ్రీరాముడిలా ధనస్సు విరిచి మరీ అమ్మాయిని వివాహం చేసుకోవాలని ముచ్చటపడ్డాడు. అలా అలనాటి శ్రీరామచంద్రుడి స్టైల్లో వరుడు ధనుష్ ముందుగా స్వయంవరం వేదిక ఎక్కి శివుణ్ని ధ్యానించాడు.
అనంతరం విల్లు ఎత్తి మధ్యలోకి విరిచేశాడు. దీంతో వివాహ వేడుకలో ఆనందాలు మిన్నంటాయి. బంధుమిత్రులు పూల వాన కురిపిస్తుండగా వధూవరులు దండలు మార్చుకున్నారు. స్వయంవరం మాత్రమే కాదు.. పెళ్లి తంతు మొత్తం పూర్తిగా సీతారామకల్యాణం లాగానే సాగింది. ఈ వివాహం రామాయణ కాలాన్ని తలపించిందని, తామెంతో ఆనందపడ్డామని బంధుమిత్రులతో పాటు స్థానికులు సంబరంగా చెప్పారు.
– – – –