Parrot Arrested Liquor Case : మద్యం కేసులో యజమానిని కాపాడుతున్న చిలుకమ్మ..అరెస్ట్ చేసిన పోలీసులు

మద్యం కేసులో బీహార్ పోలీసులు ఓ చిలుకను అరెస్ట్ చేశారు. అంతేకాదు ‘చిలుకమ్మా పలుకమ్మా..అక్రమ మద్యం దందా చేసే వ్యక్తి పేరు చెప్పమ్మా’..అంటూ వేడుకుంటున్నారు. మద్యం కేసులో చిలుకమ్మను సాక్ష్యం చెప్పమని వేడుకుంటున్న బీహార్ పోలీసులు అత్యాత్సాహం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

parrot arrested illegal liquor case

parrot arrested illegal liquor case : అక్రమ మద్యం కేసులో బీహార్ పోలీసులు ఓ చిలుకను అరెస్ట్ చేశారు. అంతేకాదు ‘చిలుకమ్మా పలుకమ్మా..అక్రమ మద్యం దందా చేసే వ్యక్తి పేరు చెప్పమ్మా’..అంటూ వేడుకుంటున్నారు. మద్యం కేసులో చిలుకమ్మను సాక్ష్యం చెప్పమని వేడుకుంటున్న బీహార్ పోలీసులు అత్యాత్సాహం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గయాలోని గురువా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో అమృత్ మల్లా అనే వ్యక్తి కుటుంబం అక్రమ మద్యం విక్రయిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారిని పట్టుకోవటానికి ఇన్స్‌పెక్టర్ కన్హయ్యకుమార్ తన పోలీసు బృందాన్ని తీసుకొని నిందితుడి ఇంటిని గుర్తించి ఆ ఇంటిపై రైడ్ చేశారు. కానీ ఆ ఇంటిలో ఓ రామచిలుక ఉంది. ఇంటికి వచ్చిన పోలీసుల్ని గుర్తించిన రామచిలుక “కటోరే కటోరే కటోరే” అంటూ అరిచింది. చిలుక అరుపులు విన్న అమృత్ మల్లా కుటుంబ మొత్తం అక్కడనుంచి ఎస్కేప్ అయ్యింది. దీంతో చిలుక వారి యజమానులకు ఏదో సంకేతం ఇచ్చింది.అందుకే వారు పారిపోయారని గ్రహించిన ఇన్స్‌పెక్టర్ కన్హయ్యకుమార్ చిలుకను పంజరంతో సహా పట్టుకొచ్చి స్టేషన్ లో పెట్టారు.

అంతేకాదు నీ యజమాని ఎక్కడ అంటూ దాన్ని అడుగుతున్నారు. పోలీసులు ఏమి అడిగినా ఆ చిలుక మాత్రం నోరు విప్పటంలేదు. అడుగగా అడుగగా.. “కటోరే కటోరే కటోరే” అని మాత్రం అంటోంది. దీంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. నేరస్తుడైన యజమానిని కాపాడేందుకు రామచిలుక చూపిస్తున్న స్వామిభక్తిని చూసి పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది.

అయితే పోలీసులు ఓ అక్రమ మద్యం తయారి వ్యాపారిని అరెస్ట్ చేసే విషయంలో చిలుకను అరెస్ట్ చేయటం చూసిన స్థానికులు సీక్రెట్‌గా వీడియో తీశారు. రామచిలుకను ఇంటరాగేషన్ చేస్తున్న వాయిస్‌ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీంతో ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. దీంతో పోలీసుల తీరు నేరస్తుల్ని పట్టుకోలేక మూగజీవిని ఇంటగేషన్ చేస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు.