Nitish Kumar: చక్రం తిప్పుతున్న సీఎం నితీశ్.. మళ్లీ ఉత్కంఠ.. ఏం జరుగుతుందో తెలుసా?

నితీశ్‌కు లాలూ ప్రసాద్ యాదవ్, సోనియా గాంధీ, ఖర్గే ఫోన్‌కాల్స్‌కు చేస్తున్నప్పటికీ స్పందించడం లేదు.

Nitish Kumar

బిహార్ రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. జేడీయూ-ఆర్జేడీ ప్రభుత్వాన్ని రద్దు చేసి బీజేపీ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి నితీశ్ సర్వం సిద్ధం చేసుకున్నారు. సీఎంగా నితీశ్ కొనసాగుతూ బీజేపీకి రెండు డిప్యూటీ సీఎం పదవులు దక్కే అవకాశం ఉంది.

జేడీయూ ఎమ్మెల్యేలతో నితీశ్ చర్చలు జరిపారు. బీజేపీ మద్దతులో నితీశ్ ఆదివారం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. జేడీయూతో పొత్తు కొనసాగించేందుకు ఆర్జేడీ, కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలను నితీశ్‌ కుమార్ పట్టించుకోవడం లేదని సమాచారం.

నితీశ్‌కు లాలూ ప్రసాద్ యాదవ్, సోనియా గాంధీ, ఖర్గే ఫోన్‌కాల్స్‌కు చేస్తున్నప్పటికీ స్పందించడం లేదు. ఆర్జేడీ కూడా దూకుడుగానే వెళుతోంది. నితీశ్ ఏ కారణాలతో మహాకూటమికి దూరంగా జరుగుతున్నప్పటికీ పదేళ్లగా ఆయన చేసిన రాజకీయాలు ఆయనకు బిహార్‌లో పల్టీ రామ్ అన్న చెడ్డపేరును తెచ్చిపెట్టాయి. 2020 ఎన్నికల్లో జేడీయూ మూడోస్థానంలో నిలిచింది. బీజేపీ అధిక స్థానాలు గెలిచింది.

అయినప్పటికీ బీజేపీ రాజీపడేలా.. తానే ముఖ్యమంత్రి పదవి చేపట్టేలా నితీశ్ చక్రం తిప్పారు. కూటములు మారుతున్నా ముఖ్యమంత్రి పదవిని మాత్రం నితీశ్‌ను వదిలిపెట్టడం లేదు. ఇలా 20 ఏళ్ల కాలంలో ఒకే వ్యక్తి తొమ్మిదిసార్లు సీఎంగా ప్రమాణం చేసి సరికొత్త రికార్డు సృష్టించారు.

Also Read: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. కులగణనకు ఆదేశం

ట్రెండింగ్ వార్తలు