Car Accident In Bhihar
Bike Accident: పార్క్ చేసిన కారు డోర్ ఓపెన్ చేయగా అటుగా వెళ్తున్న బైకర్ దాని ఢీకొట్టి కార్ కిందపడి మృతిచెందాడు. ఆదివారం రాత్రి జిరాక్‌పూర్‌లోని ఓల్డ్ కల్కా రోడ్‌లో 32 ఏళ్ల మోటార్‌సైకిలిస్ట్ పార్క్ చేసి ఉంచిన కారు తలుపు ఒక్కసారిగా తెరుచుకోవడంతో దానిని ఢీకొట్టాడు.
జిరాక్‌పూర్‌లోని గాజీపూర్ నివాసి ముఖేష్ కుమార్‌గా బాధితుడ్ని గుర్తించారు. చండీగఢ్‌లోని ఐటీ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న ముఖేష్ మోటార్ సైకిల్ నడుపుతుండగా, అతని స్నేహితుడు కమల్‌జిత్ సింగ్ కూర్చొని ఉన్నాడని దర్యాప్తు అధికారి (ఐఓ) కుల్దీప్ సింగ్ తెలిపారు.
అలా పార్క్ చేసిన కారు డోర్‌ను డ్రైవర్ అకస్మాత్తుగా తెరిచాడు. దీంతో ముఖేష్ బ్యాలెన్స్ తప్పి రోడ్డుపై పడిపోయాడు. పడిన చోట నుంచి లేవకముందే వేగంగా వస్తున్న కారు అతనిపైకి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడ్డ ముఖేశ్‌ను పట్టించుకోకుండా… పార్క్ చేసిన కారు డ్రైవర్ కూడా వేగంగా వెళ్లిపోయాడు.
Read Also: యాక్సిడెంట్ వెనుక ఏదో మిస్టరీ.. రాజ’శేఖర్’ ట్రైలర్ వచ్చేసింది!
పంచకులలోని సెక్టార్ 6లోని సివిల్ ఆసుపత్రికి తరలించినప్పటికీ ముఖేశ్ ప్రాణాలతో బయటపడలేదు. వెనుక కూర్చొని ఉన్న కమల్‌జిత్ గాయాలు లేకుండా బయటపడ్డాడు.
కమల్‌జిత్ ఫిర్యాదుపై, పోలీసులు ఇద్దరు కారు డ్రైవర్లపై ఐపీసీ సెక్షన్ 304-A, 283 కింద కేసు నమోదు చేశారు. “ఘటనాస్థలిలో CCTV ఫుటేజీ ఆధారంగా విచారణ జరుపుతున్నామని.. త్వరలో డ్రైవర్లను అరెస్టు చేస్తామ”ని అధికారులు వెల్లడించారు.