Shekar Movie: యాక్సిడెంట్ వెనుక ఏదో మిస్టరీ.. రాజ’శేఖర్’ ట్రైలర్ వచ్చేసింది!

యాంగ్రీ మెన్ రాజశేఖర్ నటిస్తున్న తాజా చిత్రం 'శేఖర్'. రాజశేఖర్ సతీమణి, నటి జీవిత రాజశేఖర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. కరోనా వలన పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం మే 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Shekar Movie: యాక్సిడెంట్ వెనుక ఏదో మిస్టరీ.. రాజ’శేఖర్’ ట్రైలర్ వచ్చేసింది!

Sekhar

Shekar Movie: యాంగ్రీ మెన్ రాజశేఖర్ నటిస్తున్న తాజా చిత్రం ‘శేఖర్’. రాజశేఖర్ సతీమణి, నటి జీవిత రాజశేఖర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. కరోనా వలన పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం మే 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో మేకర్స్ చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ‘పోలీస్‌ యూనిఫామ్‌ వేసుకొని కూడా డ్యూటీ చేయని వాళ్లు చాలామంది ఉంటారు. అదే, పోలీస్‌ ఉద్యోగానికి రిజైన్‌ చేసి కూడా డ్యూటీ కోసం ప్రాణాలిచ్చే వాళ్లు వేలల్లో ఒక్కరే ఉంటారు’ అంటూ సమీర్‌ చెప్పే డైలాగ్ తో మొదలైన శేఖర్ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది.

Shekar Movie : ‘శేఖర్’ తో హ్యాట్రిక్ కొట్టబోతున్న రాజ ‘శేఖర్’..

హీరో కూతురికి యాక్సిడెంట్ జరగడం, దాని వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలని హీరో ప్రయత్నించే సన్నివేశాలను ట్రైలర్ లో చూపించారు. ట్రైలర్ చివర్లో హీరోకి కూడా యాక్సిడెంట్ జరగడం చూపించారు. అరకు నేపథ్యంలో ‘శేఖర్’ సినిమాను తెరకెక్కించారు. రాజశేఖర్ ఈ సినిమాలో యంగ్ అండ్ ఓల్డ్ లుక్స్, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపించనున్నారు.. ఆయన కూతురు శివాని ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నారు.

Rajashekar : ‘గరుడవేగ’ సినిమాకి సీక్వెల్ చేసే ప్లాన్‌లో ఉన్నాను

రీఎంట్రీ తర్వాత రాజశేఖర్ విభిన్నమైన కథలని ఎంచుకుంటున్నారు. ఆ క్రమంలో గరుడవేగ తో హిట్ కొట్టారు. ఆ తర్వాత వచ్చిన కల్కి మూవీ కూడా పర్వాలేదనిపించింది. గరుడ వేగలో రాజశేఖర్ నేషనల్ సెక్యూరిటీ ఏజెంట్ గా నటించారు. కల్కిలో పోలీస్ గా నటించారు. మరోసారి శేఖర్ మూవీలో కూడా ఆయన పోలీస్ అధికారిగానే నటిస్తున్నారు. కాకపోతే చిన్న చేంజ్.. ఈ చిత్రంలో పోలీస్ అధికారిగా తన జాబ్ కి రాజశేఖర్ రాజీనామా చేశారు. మరి ఈ సినిమా రాజశేఖర్ ఫ్యామిలీకి హిట్టు అందిస్తుందో లేదో చూడాలి.