అగ్రకులాల్లోని పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ బీసీ రిజర్వేషన్ల బిల్లుని సవాల్ చేస్తూ గురువారం(జనవరి 10,2019) సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. రిజర్వేషన్లకు ఆర్థిక ప్రమాణాలు ఏకైక ఆధారం కాదని బిల్లుని కొట్టివేయాలంటూ యూత్ ఫర్ ఈక్వాలిటీ, కౌశల్ కాంత్ మిశ్రాలు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగం బేసిక్ ఫీచర్ ని బిల్లు ఉల్లంఘిస్తోందని పిటిషన్ లో తెలిపారు. లోక్ సభలో ఆమోదం తర్వాత బుధవారం(జనవరి10,2019) రాజ్యసభలో ఈబీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించడింది. ఈ బిల్లు ద్వారా అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారు కూడా విద్య ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు పొందనున్నారు.