‘వన్ చాయ్ ప్లీజ్’ అంటూ డాలీ చాయ్ వాలా వద్దకు కుబేరుడు బిల్‌గేట్స్

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ‘వన్ చాయ్ ప్లీజ్’ అంటూ..

మైక్రోసాఫ్ట్‌ సంస్థ అధినేత బిల్‌గేట్స్‌ భారత పర్యటనకు వచ్చారు. భువనేశ్వర్‌లో బిల్‌గేట్స్‌ ఫౌండేషన్‌ ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు. అలాగే, దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.

సామాజిక మాధ్యమాల్లో బాగా ఫేమస్ అయిన నాగ్‌‌పూర్ డాలీ చాయ్ వాలా వద్దకు కూడా బిల్ గేట్స్ వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ‘వన్ చాయ్ ప్లీజ్’ అంటూ బిల్‌గేట్స్ టీ అడిగి మరీ తాగారు. ఇక్కడి టీ రుచిని ఆస్వాదిస్తూ మైమరిచిపోయారు.

బిల్‌గేట్స్‌ అంతటి కుబేరుడు అయ్యుండి కూడా ఇంత సింపుల్ గా టీ తాగడం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు కాబట్టే ఆయన అంతటి గొప్పవ్యక్తి అయ్యారని అంటున్నారు.

కాగా, బిల్‌గేట్స్‌ తన పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లోని ఇండియా డెవలప్మెంట్‌ సెంటర్‌ను కూడా సందర్శించారు. అది ఏర్పాటై పాతికేళ్లు నిండిన సందర్భంగా ఈ కేంద్రాన్ని సందర్శించి, ఇంజనీరింగ్‌ సిబ్బందితో సమావేశమయ్యారు. ఏఐ పవర్‌గా భారత్‌ మారబోతుందని అన్నారు. 1998లో హైదరాబాద్‌లో సంస్థ ఐడీసీ సెంటర్‌ను ప్రారంభించారు.

 

Also Read: భర్తతో అనసూయ.. ఉదయాన్నే ఆహ్లాదకరంగా..

ట్రెండింగ్ వార్తలు