Bill on data privacy
Bill on data privacy: డేటా గోప్యతపై త్వరలోనే బిల్లు సిద్ధమవుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. డేటా గోప్యత బిల్లుపైనే ప్రస్తుతం ఐటీ శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ దృష్టి పెట్టారని ఆమె చెప్పారు. పార్లమెంటులో త్వరలోనే డేటా గోప్యతకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. గోప్యతా బిల్లుపై ఉన్న అన్ని సందేహాలు కూడా త్వరలోనే నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు. సంబంధిత నిపుణులందరితోనూ సంప్రదింపులు జరిపి ఈ బిల్లును తీసుకొస్తున్నట్లు తెలిపారు.
అమెరికా-భారత్ వ్యాపార మండలి ఇవాళ ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఈ సందర్భంగా మాట్లాడుతూ పై వివరాలు తెలిపారు. కాగా, వ్యక్తిగత డేటా రక్షణ బిల్లును కేంద్ర ప్రభుత్వం గత నెల లోక్‌సభ నుంచి ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుపై పార్లమెంట్ సంయుక్త కమిటీ 99 సెక్షన్లకు గాను 81 సవరణలను సూచించడంతో తాము ఆ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
అంతేగాక, 12 కీలక సిఫారసులు చేసిందని తెలిపారు. దీంతో డేటా గోప్యతపై కొత్త బిల్లు తీసుకురాకతప్పదని చెప్పారు. వచ్చే బడ్జెట్ సమావేశాల నాటికి ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉందని ఆయన అప్పట్లో తెలిపారు.
Woman bites fingers: టీవీ సౌండు తగ్గించాలని చెప్పినందుకు అత్త మూడు వేళ్ళు కొరికేసిన కోడలు