బీజేపీకి షాక్ : కాంగ్రెస్ లో చేరిన ఎంపీ ఉదిత్ రాజ్

బీజేపీ సిట్టింగ్ ఎంపీ ఉదిత్ రాజ్ కాంగ్రెస్ లో చేరారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి ఆయన టికెట్ ఆశించారు.

  • Publish Date - April 24, 2019 / 07:32 AM IST

బీజేపీ సిట్టింగ్ ఎంపీ ఉదిత్ రాజ్ కాంగ్రెస్ లో చేరారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి ఆయన టికెట్ ఆశించారు.

బీజేపీ సిట్టింగ్ ఎంపీ ఉదిత్ రాజ్ కాంగ్రెస్ లో చేరారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి ఆయన టికెట్ ఆశించారు. బీజేపీ ఆయనకు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఉదిత్ రాజ్ అనూహ్యంగా హస్తం పార్టీలో చేరారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ కండువ కప్పుకున్నారు. ఉదిత్ రాజ్ ను రాహుల్ పార్టీలో సాధరంగా ఆహ్వానించారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఉదిత్ కు తొలుత టికెట్ కేటాయించిన బీజేపీ.. చివరిలో నిర్ణయం మార్చుకుంది. 
Also Read : విపక్షాలను చూస్తుంటే స్కూల్ పిల్లలు గుర్తుకొస్తున్నారు

ఆ టికెట్ ను నార్త్ వెస్ట్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పంజాబీ షఫీ సింగర్ హన్స్ రాజ్ కు బీజేపీ కేటాయించింది. ఢిల్లీ బీజేపీ నేతల వైఖరిపై ఉదిత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి.. చివరిలో హాన్స్ రాజ్ కు టికెట్ ఖరారు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.

ఎంపీ టికెట్ విషయంలో బీజేపీ వైఖరిపై అసంతృప్తితో ఉన్న ఉదిత్ రాజ్.. బీజేపీకి గుడ్ బై చెబుతూ ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లు చేశారు. ఎంపీ అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా తన నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.