Tamil Nadu: తమిళనాడు గవర్నర్‭ను సమర్ధించనూ లేక, విమర్శించనూ లేక సతమతమవుతోన్న బీజేపీ

2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అయితే హిందీ పాలిత రాష్ట్రాల్లో సులువుగానే వెళ్లగలిగిన బీజేపీ.. హిందీయేతర రాష్ట్రాల్లో మాత్రం ఆశించిన ఫలితాల్ని సాధించలేకపోతోంది. ముఖ్యంగా దక్షిణాదిలో అయితే ఒక్క కర్ణాటక మినహా మిగిలిన రాష్ట్రాల్లో అడుగిడే ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి.

Tamil Nadu: తమిళనాడు గవర్నర్‭‭కు అధికార పార్టీకి మధ్య చెలరేగిన వివాదం మరో మలుపుకు తీసుకుంది. ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగంలో పెరియార్, అన్నాదురై వంటి పేర్లను గవర్నర్ తన ప్రసంగంలో విస్మరించడమే కాకుండా, తమిళనాడు పేరును తమిళగం అంటూ సంబోధించడంపై అన్ని తమిళ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విపక్ష పార్టీ అన్నాడీఎంకే సైతం బుధవారం అసెంబ్లీకి నల్ల చొక్కాలతో వచ్చింది. గవర్నర్ తీరు పట్ల తమిళులు సైతం కోపంగానే ఉన్నారు. అయితే ఈ కాంట్రవర్సీ వల్ల తమిళనాడు బీజేపీ పెద్ద చిక్కొచ్చి పడింది.

Bjp Mission 90 In Telangana : తెలంగాణపై బీజేపీ కన్ను..మిషన్ 90 షురూ చేసిన మోడీ, షా..నెలకు రెండు రోజులు తెలంగాణలోనే మకాం..

అటు సమర్ధించనూ లేక, ఇటు విమర్శించనూ లేక.. ఏం చేయాలో తెలియని స్థితిలో పార్టీ కొట్టుమిట్టాడుతోంది. ఒకపైపు కేంద్రం నియమించిన వ్యక్తిగా గవర్నర్‭ను విమర్శించలేకపోతున్నారు. మరోవైపు తమిళనాడు పేరును మరో రకంగా పలికిన గవర్నర్ తీరును సమర్ధించలేకనూ పోతున్నారు. ఆర్య, ద్రవిడ రాజకీయాల్లో బీజేపీ అతలాకుతలం అవుతోంది. ఏమైతేనేం, బుధవారం కాస్త దైర్యం చేసి, గవర్నర్ ఆర్ఎన్ రవికి మద్దతుగా ఒకటి రెండు మాటలు అయితే మాట్లాడారు. కానీ, పూర్తి స్థాయిలో అయితే సమర్ధించలేకపోయారు. ఇక విమర్శకు పోదామంటే పార్టీ కేంద్ర నాయకత్వం అంగీకరించదు.

Pakistan: ఆర్థిక సంక్షోభంపై తీవ్ర ఆగ్రహానికి లోనైన పాక్ ప్రజలు.. హోంమంత్రిపై చెప్పుతో దాడి

2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అయితే హిందీ పాలిత రాష్ట్రాల్లో సులువుగానే వెళ్లగలిగిన బీజేపీ.. హిందీయేతర రాష్ట్రాల్లో మాత్రం ఆశించిన ఫలితాల్ని సాధించలేకపోతోంది. ముఖ్యంగా దక్షిణాదిలో అయితే ఒక్క కర్ణాటక మినహా మిగిలిన రాష్ట్రాల్లో అడుగిడే ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కనీస సీట్లైనా సాధిస్తామని అనుకున్న బీజేపీ నమ్మకానికి గుండు సున్నానే ఫలితంగా మిగింది.

ట్రెండింగ్ వార్తలు