Bjp Mission 90 In Telangana : తెలంగాణపై బీజేపీ కన్ను..మిషన్ 90 షురూ చేసిన మోడీ, షా..నెలకు రెండు రోజులు తెలంగాణలోనే మకాం..

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్టాం ఫోకస్ పెట్టింది.బీజేపీ మిషన్ 90ను షురూ చేసింది తెలంగాణలో, రాజకీయ చాణక్యుడుగా పేరొందిన అమిత్ షా ఇక ప్రతీ నెలా రెండు రోజులు తెలంగాణలో పర్యటించనున్నారు. దీంట్లో భాగంగా

Bjp Mission 90 In Telangana : తెలంగాణపై బీజేపీ కన్ను..మిషన్ 90 షురూ చేసిన మోడీ, షా..నెలకు రెండు రోజులు తెలంగాణలోనే మకాం..

Bjp Mission 90 In Telangana

Bjp Mission 90 In Telangana : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్టాం ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా ఫోకస్ పెట్టారంటే ఆ గురి తప్పదనే ఇప్పటికే బీజేపీ విజయం సాధించిన రాష్ట్రాల లిస్టు చెబుతోంది. మోడీ, షాల ద్వయం టార్గెట్ మిస్ అవ్వదనే పలు సందర్భాలు నిరూపితమయ్యాయి. కానీ దక్షిణాదిలో ఈ ఇద్దరి వ్యూహాలు చెల్లవనే కేరళ,తమిళనాడు రాష్ట్రాలు నిరూపించాయి. ఉత్తరాదిపై పట్టు సాధించినట్లుగా దక్షిణాది రాష్ట్రాలపై కూడా అధికారం సాధించటానికి బీజేపీ అగ్రనేతలు వ్యూహాలు పన్నుతున్నారు. దీంట్లో భాగంగానే తెలంగాణపై కన్నేసింది మోడీ, షాల ద్వయం. దీని కోసం తెలంగాణలో దూకుడు పెంచింది. దీంతో ఇటు బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ఘాటు ఘాటు విమర్శలు కొనసాగుతున్నాయి. బీజేపీ ఎన్నికల కసరత్తులు మొదలుపెట్టేసింది.

వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభానికి ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనలో భాగంగా బీజేపీ పార్టీ పరంగా పరేడ్ గ్రౌండ్ లో ప్రధాని ప్రసంగంతో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. కానీ ప్రధాని పర్యటన వాయిదా పడింది. ఈక్రమంలో అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు పర్యటనలో భాగంగా అమిత్ షా జనవరి 28న తెలంగాణ రానున్నారు. ఇలా ఒకసారే కాదు తెలంగాణాలో గెలుపు కోసం అధికారం కోసం అమిత్ షా ఇక ప్రతీ నెలా తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.బీజేపీ సంస్థాగత అంశాలే ప్రధాన ఎజెండగా ఈ టూర్లు ఉండనున్నాయి. టార్గెట్ తెలంగాణ మిషన్ 90 పర్యటలు చేయనున్నారు షా.

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయాలని తహతహలాడుతోంది. ఈ ప్లాన్ లో భాగంగా బీజేపీ అగ్రనేతల తెలంగాణ పర్యటనలు షురూ చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ కూడా బీజేపీ ప్లాన్లపై ఫోకస్ పెడుతోంది. వారి వ్యూహాలను తిప్పి కొట్టి మరోసారి గెలుపు కోసం కసరత్తులు చేస్తోంది.ఇక బీజేపీ మిషన్ 90 షురూ చేసింది. బీజేపీ మిషన్ 90ను ప్రధాని పర్యటనతోనే మొదలు పెట్టనున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ప్రధాని తెలంగాణ పర్యటన వాయిదా పడటం అమిత్ షా మాత్రం ఇకనుంచి ప్రతీ నెలా రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించాలనుకోవటం వంటి విషయాలు తెలంగాణను హీటెక్కిస్తున్నాయి. మరికొన్ని నెలల్లోనే తెలంగాణ ఎన్నికలు జరుగుతాయంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యలు..ప్రధాని మోడీ, అమిత్ షాల పర్యటనలతో ఇక తెలంగాణా హీటెక్కుతోంది. తెలంగాణ రాజకీయ వర్గాల్లో కాక రేపుతోంది.