సార్వత్రిక ఎన్నికల వేళ.. రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఎన్నికలకు వారం రోజులే గడువు ఉండటంతో ప్రచారాలు ఊపందుకున్నాయి. ఓటర్ల నాటి పసిగట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల వేళ.. రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఎన్నికలకు వారం రోజులే గడువు ఉండటంతో ప్రచారాలు ఊపందుకున్నాయి. ఓటర్ల నాటి పసిగట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అలవాటు లేని పనులు చేసేస్తున్నారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసిన సినీతారలు కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. వెండితెరపై మెప్పించిన తారలంతా నేరుగా ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లు అడుగుతున్నారు.
బాలీవుడ్ అందాల తార హేమా మాలినీ కూడా రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించేందుకు ఎన్నికల ప్రచారంలో దిగారు. ఓటర్లను ఆకర్షించేందుకు చేత కొడవలి పట్టి గోధుమను కోత కోశారు. మథుర నియోజక వర్గం నుంచి బీజేపీ తరపున లోక్ సభ స్థానానికి హేమామాలినీ పోటీ చేస్తోంది. ఆదివారం మథుర నియోజవర్గంలో వరి కోత కోస్తున్న మహిళల దగ్గరకు వెళ్లి ఆమె కూడా కొడవలి చేతబట్టి గోధుమను కోశారు. సినిమా తరహాలో లొకేషన్ కు తగినట్టుగా లేత పసుపు వర్ణం శారీ ధరించి వరి కోత కోసి ప్రజల దృష్టిని ఆకర్షించారు.
Read Also : ఈ ఏడాది 4 సినిమాలు రిలీజ్ చేయాలనేది చైతూ ప్లాన్
ఈ సందర్భంగా హేమా మాలినీ మాట్లాడుతూ.. నా నియోజకవర్గంలో ప్రచారం మొదలైంది. ప్రజలు నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మథుర నియోజవర్గానికి చేసిన మేలు కారణంగానే ప్రజలు నన్ను ఆహ్వానిస్తున్నారు. నేను చేసిన పనికి ఎంతో గర్వపడుతున్నాను. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతాను. గతంలో మథుర నియోజవర్గానికి నేను చేసినంతంగా ఎవరూ చేయలేదు’ అని చెప్పారు.
2014లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన హేమా.. 3లక్షల 30వేల ఓట్లతో విజయం సాధించింది. హేమామాలినీ స్థానిక మహిళా రైతులతో కలిసి గోధుమపైరును కోత కోస్తున్న ఫొటోలను ట్విట్టర్ లో పోస్టు చేయడంతో వైరల్ గా మారాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్ లో మథుర నియోజకవర్గానికి హేమామాలినీ ప్రాతినిథ్య వహిస్తుండగా.. విపక్షాలు ఆమెను ఔట్ సైడర్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
Began my Lok Sabha campaign today with the Govardhan Kshetra where I had the opportunity to interact with women working in the fields. A few fotos for u of my first day of campaign pic.twitter.com/EH7vYm8Peu
— Hema Malini (@dreamgirlhema) March 31, 2019