Madurai: ఎయిమ్స్ పనులు 95% పూర్తయ్యాయన్న జేపీ నడ్డా.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన కాంగ్రెస్ నేత

కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ నిర్మించతలపెట్టిన ప్రాంతానికి ఆయన స్వయంగా వెళ్లి.. ఖాళీ ప్రదేశాన్ని చూపిస్తూ నడ్డాపై విమర్శలు గుప్పించారు. డీఎంకే పార్టీని వారసత్వ పార్టీ అంటూ నడ్డా చేసిన వ్యాఖ్యలపై డీఎంకే మండపడింది. క్రికెట్‭లో జయ్‭షా ఎన్ని దశాబద్దాలుగా ఉన్నారో చెప్పారని, అసలు ఆయనకు బీసీసీఐ కార్యదర్శి పదవిని ఏ అర్హతతో ఇచ్చారో చెప్పాలని నడ్డాను డిమాండ్ చేశారు.

Madurai: ప్రస్తుతం తమిళనాడు పర్యటనలో ఉన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా.. శుక్రవారం మధురైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మధురై సమీపంలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోన్న ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నిర్మాణం 95 శాతం పూర్తైందని అన్నారు. కాగా, నడ్డా చేసిన ఈ వ్యాఖ్యలకు వీడియో ద్వారా దిమ్మతిరిగే రిప్లై ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ మాణిక్యం ఠాకూర్. కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ నిర్మించతలపెట్టిన ప్రాంతానికి ఆయన స్వయంగా వెళ్లి.. ఖాళీ ప్రదేశాన్ని చూపిస్తూ నడ్డాపై విమర్శలు గుప్పించారు.

నడ్డా వ్యాఖ్యలకు సంబంధించిన వార్తా క్లిప్పు, తన సహాయకులతో కలిసి మధురై సమీపంలోని తొప్పులో ఎయిమ్స్ నిర్మించడానికి ప్రతిపాదించిన స్థాలానికి వెళ్లిన మాణిక్యం ఠాకూర్.. వీడియాలో ఖాళీ ప్రదేశాన్ని చూపిస్తూ ‘‘95 శాతం పనులు పూర్తి చేసుకున్న ఎయిమ్స్ ఇదే.. వాస్తవానికి ఇక్కడ ఒక్క ఇటుక కూడా ఇప్పటికి పళ్లేదు. పని ప్రారంభమే కానీ ప్రాజెక్టు 95 శాతం పూర్తైందని చెప్పడం చాలా ఆశ్చర్యకరం. నడ్డా సహా బీజేపీ నేతలు పచ్చి అబద్దాలు చెబుతున్నారు. మధురైని, తమిళనాడు ప్రజలను మోసం చేస్తున్నారు’’ అని వీడియోలో అన్నారు.

ఇక డీఎంకే పార్టీని వారసత్వ పార్టీ అంటూ నడ్డా చేసిన వ్యాఖ్యలపై డీఎంకే మండపడింది. క్రికెట్‭లో జయ్‭షా ఎన్ని దశాబద్దాలుగా ఉన్నారో చెప్పారని, అసలు ఆయనకు బీసీసీఐ కార్యదర్శి పదవిని ఏ అర్హతతో ఇచ్చారో చెప్పాలని నడ్డాను డిమాండ్ చేశారు.

Viral Video: గ్లౌజులు లేవు, చీపురు లేదు.. ఒట్టి చేతులతో స్కూల్ టాయిలెట్ కడిగిన బీజేపీ ఎంపీ

ట్రెండింగ్ వార్తలు