Viral Video: గ్లౌజులు లేవు, చీపురు లేదు.. ఒట్టి చేతులతో స్కూల్ టాయిలెట్ కడిగిన బీజేపీ ఎంపీ

ఈ వీడియోపై నెటిజెన్లు భిన్నమైన రీతిలో స్పందిస్తున్నారు. బీజేపీ అనుకూలురు ఎంపీ చేసిన పనిపై ప్రశంసలు కురిపిస్తుండగా.. బీజేపీ వ్యతిరేకులు ఎంపీ మరీ దిగజారి ప్రవర్తించారని, చేతులతో శుభ్రం చేయడమేంటని మండిపడుతున్నారు. మరి కొంత మంది నెటిజెన్లు.. ఆయన ఏ ఉద్దేశంతో చేసినప్పటికీ.. చేయాల్సిన పనేనంటూ కొంటెగా స్పందిస్తున్నారు.

Viral Video: గ్లౌజులు లేవు, చీపురు లేదు.. ఒట్టి చేతులతో స్కూల్ టాయిలెట్ కడిగిన బీజేపీ ఎంపీ

Madhya Pradesh BJP MP Cleans School Toilet With Bare Hands

Viral Video: రాజకీయ నేతలు అప్పుడప్పుడు పారిశుధ్య పనులు చేస్తుండడం చూస్తూనే ఉంటాం. అందరూ అని కాదు కానీ, చాలా మంది ఫొటోల కోసం చీపుర్లు పట్టుకుని కాసేపు చెత్తను ఊడ్చినట్లు నటిస్తుంటారు. ప్రధానమంత్రి స్థాయి నుంచి గ్రామ స్థాయి నేత వరకు రాజకీయాల్లో ఇలాంటి విచిత్రాలకు కొదువ ఉండదు. అయితే ఒక్కోసారి కొందరు నేతలు చాలా సీరియస్‭గానే తీసుకుని పనులు చేస్తుంటారు. ఆ మధ్య ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. కొందరు పారిశుధ్య కార్మికుల కాళ్లు కడగడం చర్చనీయాంశమే అయింది.

అయితే ఇంత సీరియస్‭గా చేసే పనుల్లో కూడా రాజకీయ అంతర్యం ఉండకపోతే.. ఇక తాజాగా భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ ఒకరు పాఠశాల మరుగుదొడ్డి కడిగి అందరి దృష్టిని ఆకర్షించారు. కడగటం అంటే అలా ఇలా కాదు. చేతికి గ్లౌజులు లేకుండా, కనీసం చీపురు, టాయిలెట్ క్లీనింగ్ బ్రష్ కూడా ఒట్టి చేతులతో టాయిలెట్ క్లీన్ చేశారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో ‘సేవా పఖ్వాడా’ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి మద్దతునిచ్చిన బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా.. ఖత్కారీ బాలికల పాఠశాలలోని టాయిలెట్ కడుగుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Iran President Cancel Interview: జర్నలిస్ట్‭కు హెడ్ స్కార్ఫ్ లేదని ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేసిన ఇరాన్ అధ్యక్షుడు

ఈ వీడియోను స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన జనార్దన్ మిశ్రా.. ‘‘పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న సేవా పఖ్వాడా కార్యక్రమంలో భాగంగా ఖత్కారిలోని బాలికల పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం అనంతరం యువమోర్చా ఆధ్వర్యంలో అదే పాఠశాలలోని మరుగుదొడ్లను శుభ్రం చేశాను’’ అని హిందీలో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‭లో ప్రధాని మోదీ, బీజేపీ అధినేత జేపీ నడ్డా, మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్, బీజేపీ జనరల్ సెక్రెటరీ బీఎల్ సంతోష్, మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ వీడీ శర్మ, మధ్యప్రదేశ్ జనరల్ సెక్రెటరీ హితానంద్ శర్మలను ట్యాగ్ చేశారు.

కాగా, ఈ వీడియోపై నెటిజెన్లు భిన్నమైన రీతిలో స్పందిస్తున్నారు. బీజేపీ అనుకూలురు ఎంపీ చేసిన పనిపై ప్రశంసలు కురిపిస్తుండగా.. బీజేపీ వ్యతిరేకులు ఎంపీ మరీ దిగజారి ప్రవర్తించారని, చేతులతో శుభ్రం చేయడమేంటని మండిపడుతున్నారు. మరి కొంత మంది నెటిజెన్లు.. ఆయన ఏ ఉద్దేశంతో చేసినప్పటికీ.. చేయాల్సిన పనేనంటూ కొంటెగా స్పందిస్తున్నారు.

Sharmila On NRT university name change: ‘అవసరం లేదు’.. అంటూ ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పుపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు