Hindu Anti Conversion
BJP Leader: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లీడర్.. బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య ఘర్ వాపసీ ప్రచారంలో ఓ అడుగు ముందుకేసి హిందు మతం నుంచి ఇతర మతాల్లోకి మారిన వారిని తిరిగి సొంతమతంలోకి రప్పిస్తామన్నారు. ప్రసంగంలో భాగంగా కామెంట్లు చేసి కాంట్రవర్సీ కాకూడదని కాసేపటికే విరమించుకుంటున్నట్లు తెలిపారు. ముందుగా మాట్లాడినప్పుడు ప్రతి గుడి, మఠం టార్గెట్ పెట్టుకుని హిందు మతం నుంచి ఇతర మతంలోకి మారిన వాళ్లను తిరిగి హిందూయిజంలోకి తీసుకురావాలని అన్నారు.
‘ఉడుపి శ్రీ కృష్ణ మఠ్ వేదికగా జరిగిన కార్యక్రమంలో భారతంలో హిందువుల పునరుజ్జీవనం అంశంపై మాట్లాడాను. ఆ కామెంట్లు కాంట్రవర్సీని క్రియేట్ చేస్తున్నాయని తెలిసి.. వాటిని ఉపసంహరించుకుంటున్నా.’ అన్ని అన్నారు.
అంతేకంటే ముందు ‘కేవలం ముందున్న ఆప్షన్ ఏంటంటే.. కన్వర్ట్ అయిన హిందువులు రీ కన్వర్ట్ అయి సొంత మతంలోకి రావాలి. సహజంగా జరగకపోయినా ఇప్పుడు మనం మాత్రం కలవాల్సిందే. ఇది మన డీఎన్ఏ’ అని తేజస్వీ సూర్య అన్నారు.
rEAD aLSO: శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ల కోటా డిసెంబర్ 28న విడుదల
డిసెంబర్ 25న కర్ణాటకలోని ఉడుపి కేంద్ర మాట్లాడిన ఆయన.. రీ కన్వర్షన్ అనేది సహజంగా జరగకపోయినా.. హిందువులు మాత్రం మమేకం కావాల్సిన సమయమిది. పుట్టిన మతంలోకి మారిన వారందరినీ తీసుకురావాలని అన్నారు. కర్ణాటక అసెంబ్లీ యాంటీ కన్వర్షన్ బిల్ తీసుకొచ్చిన కొద్ది రోజులకే ఈ కామెంట్లు చేయడం గమనార్హం.