Rattan Lal Kataria: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ రతన్ లాల్ కటారియా కన్నుమూత
చండీగఢ్ లోని మణిమజ్రలో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రతన్ లాల్ అంత్యక్రియలు జరుగుతాయి.
- T Venkateshwarlu
- Published On : May 18, 2023 / 09:28 AM IST
Rattan Lal Kataria
Ambala MP: కేంద్ర మాజీ సహాయ మంత్రి, బీజేపీ ఎంపీ రతన్ లాల్ కటారియా (72) అనారోగ్యంతో కన్నుమూశారు. చండీగఢ్ (Chandigarh) లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన ఆయన పరిస్థితి విషమించి మృతి చెందారు. ఈ మేరకు రతన్ లాల్ కటారియా భార్య భాంటో కటారియా (Banto Kataria) ప్రకటన చేశారు.
రతన్ లాల్ కటారియా 2019-21 మధ్య కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. అంబాలా నియోజక వర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మృతి పట్ల హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సంతాపం తెలిపారు. త్రిపుర మాజీ సీఎం బిప్లవ్ కుమార్ దేబ్ బుధవారం ఆసుపత్రికి వెళ్లి రతన్ లాల్ ను పరామర్శించి, ఆయన త్వరగా కోలుకోవాలని అన్నారు. ఇవాళ ఉదయం రతన్ లాల్ కన్నుమూత వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు.
రతన్ లాల్ కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నట్లు ట్విట్టర్ లో పేర్కొన్నారు. కాగా, రతన్ లాల్ కటారియా మూడు సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2019-21 మధ్య కేంద్ర జల శక్తి, సామాజిక న్యాయ శాఖల సహాయ మంత్రిగా పనిచేశారు. చండీగఢ్ లోని మణిమజ్రలో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రతన్ లాల్ అంత్యక్రియలు జరుగుతాయి.
Hinduja: హిందూజ గ్రూప్ ఛైర్మన్ శ్రీచంద్ పర్మానంద్ కన్నుమూత.. గ్రూప్ తదుపరి ఛైర్మన్?
