నాకు టికెట్ వద్దు: జేపీ నడ్డాను కోరిన బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా

రాబోయే లోక్‌సభ ఎన్నికలలో తనకు టిక్కెట్ ఇవ్వొద్దని బీజేపీ అధినాయకత్వానికి ఎంపీ జయంత్ సిన్హా మనవి చేసుకున్నారు.

BJP MP Jayant Sinha Tells Party will not Contest Polls

BJP MP Jayant Sinha: మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ బాటలోనే మరో బీజేపీ ఎంపీ పయనించారు. యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తనను తప్పించాలని బీజేపీ అధినాయకత్వానికి మొరపెట్టుకున్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలలో తనకు టిక్కెట్ ఇవ్వొద్దని కూడా మనవి చేసుకున్నారు. ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన జార్ఖండ్‌లోని హజారీబాగ్ లోక్‌సభ నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. క్రియాశీలక రాజకీయాల నుంచి తనకు విముక్తి కల్పించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కోరినట్టు ట్విటర్ ద్వారా వెల్లడించారు.

”డైరెక్ట్ ఎలక్టోరల్ విధుల నుంచి నన్ను తప్పించాలని జేపీ నడ్డాను కోరుతున్నాను. మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులపై పోరాటం చేయాలనుకుంటున్నాను. ఆర్థిక, పాలనాపరమైన అంశాల్లో పార్టీతో కలిసి పని చేస్తూనే ఉంటాను. గత పదేళ్లుగా దేశానికి, హజారీబాగ్ ప్రజలకు సేవ చేసే భాగ్యం నాకు దక్కింది. ఈ అవకాశం కల్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ నాయకత్వానికి ధన్యవాదాల”ని జయంత్ సిన్హా పేర్కొన్నారు.

Also Read: మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ కేసులో కీలక పరిణామం.. రూ.580 కోట్ల ఆస్తులు ఫ్రీజ్

కాగా, గౌతమ్ గంభీర్ కూడా బీజేపీ అధినాయకత్వానికి ఇదే రకమైన అభ్యర్థన చేశాడు. రాజకీయ బాధ్యతల నుంచి తనను తప్పించాలని జేపీ నడ్డాను కోరాడు. ఎంపీగా తనకు ఛాన్స్ ఇచ్చినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు చెప్పాడు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో గంభీర్‌కు టికెట్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో అతడీ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Also Read: గౌతమ్ గంభీర్ అనూహ్య నిర్ణయం.. యాక్టివ్ పాలిటిక్స్‌కు గుడ్‌బై!