BJP MP Muniswamy: మహిళా దినోత్సవం రోజే మహిళపై బీజేపీ ఎంపీ ఆగ్రహం.. బొట్టు పెట్టుకోలేదని విమర్శ.. వీడియో వైరల్

కర్ణాటక, కోలార్ జిల్లాకు చెందిన బీజేపీ ఎంపీ మునిస్వామి బుధవారం ఒక ఎగ్జిబిషన్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన అనుచరులతో కలిసి అక్కడి స్టాళ్లను సందర్శించారు. అయితే, అక్కడ ఒక స్టాల్‌లో మహిళా వ్యాపారి బట్టలు విక్రయిస్తోంది. కానీ, ఆమె ఆ సమయంలో నుదుట బొట్టు పెట్టుకుని లేదు.

BJP MP Muniswamy: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే ఒక మహిళపై బీజేపీ ఎంపీ ఆగ్రం వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. బొట్టు పెట్టుకోలేదని ఒక మహిళపై బీజేపీ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

India-Pak: పాక్ రెచ్చగొడితే భారత్ సైనిక చర్యకు దిగుతుంది.. అమెరికా వర్గాల అంచనా

కర్ణాటక, కోలార్ జిల్లాకు చెందిన బీజేపీ ఎంపీ మునిస్వామి బుధవారం ఒక ఎగ్జిబిషన్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన అనుచరులతో కలిసి అక్కడి స్టాళ్లను సందర్శించారు. అయితే, అక్కడ ఒక స్టాల్‌లో మహిళా వ్యాపారి బట్టలు విక్రయిస్తోంది. కానీ, ఆమె ఆ సమయంలో నుదుట బొట్టు పెట్టుకుని లేదు. ఆ స్టాల్ దగ్గరకు చేరుకున్న ఎంపీ మునిస్వామి ఆ మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ముందు బొట్టు పెట్టుకో. మీ భర్త బతికే ఉన్నాడు కదా. కనీసం కామన్ సెన్స్ లేదా’’ అంటూ ఆ మహిళపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఘటనను అక్కడి వాళ్లెవరో వీడియో తీశారు.

India-Pak: పాక్ రెచ్చగొడితే భారత్ సైనిక చర్యకు దిగుతుంది.. అమెరికా వర్గాల అంచనా

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు దీనిపై విమర్శలు చేస్తున్నాయి. కొందరు నెటిజన్లు కూడా ఎంపీ వైఖరిని తప్పుబడుతున్నారు. మహిళా దినోత్సవం రోజే మహిళను అవమానించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ఎంపీ వైఖరి.. ఆ పార్టీ సంస్కృతిని, మహిళలకు ఇచ్చే గౌరవాన్ని తెలియజేస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. బీజేపీ దేశాన్ని ‘హిందూత్వ ఇరాన్‌’గా మారుస్తోందని, వీధుల్లో ‘మోరల్ పోలిసింగ్’ చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం విమర్శించారు.