Sivasri - Tejasvi Surya
BJP MP Tejasvi Surya – Singer Sivasri : బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివాహం నిశ్చమైంది. దేశంలోనే అత్యంత చిన్న వయస్సు కలిగిన ఎంపీల్లో ఒకరిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బెంగళూరు దక్షిణ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండోసారి ఆయన విజయం సాధించారు. వృత్తిరిత్యా లాయర్ అయిన తేజస్వి సూర్య.. రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటారు. 2020 నుంచి భారతీయ జనతా యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా తేజస్వి వ్యవహరించారు. తన పదునైన ప్రసంగాలు, పార్టీ బలోపేతానికి తేజస్వీ కృషిని గతంలో పలుసార్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. రాజకీయాల్లో తేజస్వీ సూర్యకు రోల్ మోడల్ ప్రధాని నరేంద్ర మోదీ. ఈ విషయాన్ని స్వయంగా తేజస్వీ చాలాసార్లు సభల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన పెళ్లిపీటలెక్కబోతున్నాడు.
తేజస్వీ సూర్య చెన్నైకు చెందిన ప్రముఖ గాయని, శాస్త్రీయ సంగీతం, భరత నాట్య కళాకారిణి అయిన శివశ్రీ స్కంద ప్రసాద్ ను వివాహం చేసుకోబోతున్నాడు. వీరి వివాహానికి ముహూర్తంసైతం నిశ్చయమైంది. ఈ విషయాన్ని మంగళవారం బెంగళూరులో తేజస్వీ ప్రకటించారు. మార్చి 24వ తేదీన పెళ్లి ముహూర్తం నిర్ణయించినట్లు వెల్లడించారు. దీంతో రాజకీయాల్లో చురుకైన నేతగా గుర్తింపుఉన్న తేజస్వీ సూర్య చేసుకోబోయే అమ్మాయి ఎవరు.. ఆమె వృత్తి ఏమిటి..? ఆమె ఎక్కడ చదువుకుంది అనే విషయాలపై తేజస్వీని అభిమానించేవారు ఆరా తీస్తున్నారు.
Also Read: 2025 ఏడాదిలోకి అడుగుపెట్టిన వేళ.. ట్విటర్‌లో ప్రత్యేక వీడియో షేర్ చేసిన సీఎం చంద్రబాబు
శివశ్రీ స్కంద ప్రసాద్ సింగర్. పొన్నియిన్ సెల్వన్ సినిమాలోని పార్ట్-2లో కన్నడ వర్షన్ లోని ఒక పాటను శివశ్రీ పాడారు. ఆమెకు సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. దానికి 2లక్షల మందికిపైగా సబ్ స్కైబర్లు ఉన్నారు. శివశ్రీ మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి భరతనాట్యంలో ఎంఏ, మద్రాస్ సంస్కృత కళాశాలలో సంస్కృతంలో ఎంఏ పూర్తి చేశారు. శాస్త్ర యూనివర్శిటీ నుంచి బయో ఇంజినీరింగ్ లో డిగ్రీ పూర్తి చేశారు. ఆమె గతంలో ప్రధాని నరేంద్ర మోదీచే మనన్నలు పొందారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో 2014 సంవత్సరంలో శివశ్రీ ఆలపించిన ఒక పాట అద్భుతంగా ఉందని మోదీ ప్రసంశించారు. ఆ పాటలో శ్రీరాముడి గురించి శివశ్రీ అద్భుతంగా వర్ణించారు.