Manish Sisodia on BJP: నన్ను మరో షిండే అవ్వమన్నారు, ఆప్‭ను చీలిస్తే సీఎం పదవి ఇస్తారట.. బీజేపీపై సిసోడియా సంచలన ఆరోపణలు

‘‘మహారాష్ట్రలో వేసిన ఎత్తుగడే ఢిల్లీలో వేయాలని బీజేపీ నేతలు ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా నాకు బీజేపీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. నన్ను మరో షిండే అవ్వమని ఆ లేఖలో ఉంది. అంటే నేను ఆప్‭ను చీలిస్తే నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని బీజేపీ నేతలు ఆఫర్ చేశారు. అలా చేస్తే సీబీఐ-ఈడీలను వెనక్కి పిలుస్తామని చెప్పారు’’ అని సిసోడియా అన్నారు.

Manish Sisodia on BJP: సీబీఐ దాడుల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య రాజకీయ యుద్ధం తారాస్థాయిలో కొనసాగుతోంది. ఇరు పక్షాల నేతలు ఆరోపణలు, విమర్శలతో దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇప్పటికే ఉన్న అగ్నికి మరింత ఆజ్యం పోసేలా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియా సంచలన ఆరోపనలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని చీలిస్తే తనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని భారతీయ జనతా పార్టీ ఆఫర్ ఇచ్చిందని వ్యాఖ్యానించడంతో ఇప్పటికే కాక మీద ఉన్న ఢిల్లీ రాజకీయం మరింత వేడెక్కింది.

సోమవారం ఆయన ఒక ర్యాలీలో మాట్లాడుతూ ‘‘మహారాష్ట్రలో వేసిన ఎత్తుగడే ఢిల్లీలో వేయాలని బీజేపీ నేతలు ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా నాకు బీజేపీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. నన్ను మరో షిండే అవ్వమని ఆ లేఖలో ఉంది. అంటే నేను ఆప్‭ను చీలిస్తే నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని బీజేపీ నేతలు ఆఫర్ చేశారు. అలా చేస్తే సీబీఐ-ఈడీలను వెనక్కి పిలుస్తామని చెప్పారు’’ అని సిసోడియా అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘అయితే నేను వారికి చాలా సూటిగా ఒక సమాధానం చెప్పాను. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నా రాజకీయ గరువు. రాజకీయాలు నేను ఆయన దగ్గరి నుంచి నేర్చుకున్నాను. నేను సీఎం, పీఎం అయ్యేందుకు రాజకీయాల్లోకి రాలేదు’’ అని అన్నారు.

ప్రస్తుతం గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రంలో నిర్వహించిన పలు ర్యాలీల్లో పాల్గొంటూ బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుత సీబీఐ పరిణామాలు ఆప్‭కు బాగా కలిసి వచ్చినట్టున్నాయి. గుజరాత్‭లో అధికారంలో ఉన్న బీజేపీపై ఆప్.. ఆప్‭పై బీజేపీ విమర్శలు చేసుకుంటూ ప్రజల్లో ఎప్పటికప్పుడు నానుతున్నారు. దీన్ని మరింత పదునుగా వాడుకునేందుకు కేజ్రీవాల్ వ్యూహాలు రచిస్తున్నట్లు వినికిడి.

Pakistan: దైవదూషణ చేశాడని దండెత్తిన గుంపు.. పారిపోయి ప్రాణాలు దక్కించుకున్న హిందూ వ్యక్తి

ట్రెండింగ్ వార్తలు