Pakistan: దైవదూషణ చేశాడని దండెత్తిన గుంపు.. పారిపోయి ప్రాణాలు దక్కించుకున్న హిందూ వ్యక్తి

నెటిజెన్లు సోషల్ మీడియా ద్వారా హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, వారు వెంటనే స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకుని లాఠీ చార్జ్ చేశారు. ఈ ఘటనపై నెటిజెన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ ఒక్కరిపై ధ్వేషం తగదని, ఏవైనా తప్పులు జరిగినా సర్దుకు పోవాలని చెబుతున్నారు. ఇక లాఠీ చార్జ్‭ చేసిన హైదరాబాద్ పోలీసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Pakistan: దైవదూషణ చేశాడని దండెత్తిన గుంపు.. పారిపోయి ప్రాణాలు దక్కించుకున్న హిందూ వ్యక్తి

Hindu man escapes lynching in Pakistan over alleged blasphemy

Pakistan: ఖురాన్‭ను కించపరుస్తూ వ్యాఖ్యానించాడనే కారణంతో పాకిస్తాన్‭లోని హైదరాబద్‭కు చెందిన ఒక హిందూ వ్యక్తిపైకి పెద్ద గుంపు దాడికి బయల్దేరింది. పారిశుద్య కార్మికుడిగా పని చేస్తున్న ఆ వ్యక్తి నివాసం ఉండే అపార్ట్‭మెంట్ వద్దకు పెద్ద సంఖ్యలో వచ్చిన గుంపు.. అపార్ట్‭మెంట్ ఎక్కి సదరు వ్యక్తిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి.. అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నాడు. కాగా, దాడికి వచ్చిన గుంపుపై నెటిజెన్లు స్థానిక పోలీసులు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని లాఠీ చార్జ్ చేసి అందరినీ చెదగొట్టారు.

ఖురాన్‭పై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పేరు సంతోష్ కుమార్. ఈ విషయమై సంతోష్‭పై పాకిస్తాన్ చట్టాల ప్రకారం సెక్షన్ 295బీ కింద హైదరాబాద్‭లోని ఒక పోలీస్ స్టేషన్‭లో కేసు నమోదు అయింది. అయితే వాస్తవానికి అతడేమీ ఖురాన్‭పై అసభ్యంగా మాట్లాడలేదని, వాస్తవానికి అతడు నివాసం ఉండే ప్రదేశంలోని బిలాల్ అబ్బాసీ అనే కిరాణకొట్టు వ్యక్తితో గొడవ జరగిందని, ఆ కోపంతోనే ఖురాన్‭పై అనుచిత వ్యాఖ్యలు చేశాడని తప్పుడు కేసు పెట్టినట్లు సమాచారం.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెద్ద సంఖ్యలో వచ్చిన గుంపు.. సంతోష్ నివాసం ఉండే అపార్ట్‭మెంట్ ఎక్కుతూ నానా హంగామా చేశారు. పెద్ద ఎత్తున అరుస్తూ స్థానికంగా భయానక పరిస్థితి ఏర్పరిచారు. అయితే నెటిజెన్లు సోషల్ మీడియా ద్వారా హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, వారు వెంటనే స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకుని లాఠీ చార్జ్ చేశారు. కాగా, ఈ ఘటనపై నెటిజెన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ ఒక్కరిపై ధ్వేషం తగదని, ఏవైనా తప్పులు జరిగినా సర్దుకు పోవాలని చెబుతున్నారు. ఇక లాఠీ చార్జ్‭ చేసిన హైదరాబాద్ పోలీసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

పాకిస్తాన్‭లో ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదు. మైనారిటీ హక్కులపై కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ ఏదో కారణంతో ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. గతేడాది డిసెంబర్‭లో శ్రీలంకకు చెందిన ఒక వ్యక్తిపై ఇలాగే మూక దాడి చేసి హతమార్చారు. అది కూడా ఒక పోలీస్ స్టేషన్‭కు సమీపంలోనే జరగడం గమనార్హం. ఆ సమయంలో పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఈ ఘటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘పాకిస్తాన్‭కు ఇది చీకటి రోజు’’ అని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు.