బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం

  • Publish Date - December 11, 2019 / 05:09 AM IST

బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్లమెంట్ లైబ్రరీ  హాలులో ప్రారంభమయ్యింది.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీసహా పలువరు బీజేపీ నేతలు ఈ సమావేశానికి హజరయ్యారు. కీలకమైన పౌరసత్వ బిల్లు రాజ్యసభలో ఈరోజు మధ్యాహ్నం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా  ప్రవేశపెడుతున్నందున దీనిపై అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 
బిల్లుపై రాజ్యసభలో జరిగే చర్చలో కాంగ్రెస్ నేత కపిల్ సిబల్, టీఎంసీకి చెందిన డెరెక్ ఒబ్రెయిన్, సమాజ్‌వాదీ పార్టీ నుంచి రామ్‌గోపాల్ యాదవ్ పాల్గొంటారు. ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ ఎంపీలకు విప్ జారీచేశారు. కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీల వ్యతిరేకత, ఈశాన్య రాష్ట్రాల్లో బిల్లుకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల తీవ్ర నిరసనల మధ్య బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడుతుండటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.