Exit poll results: త్రిపుర, నాగాలాండ్ లో బీజేపీ.. మేఘాలయాలో ఎన్పీపీదే అధికారం!

మేఘాలయా, నాగాలాండ్ లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇంతకు ముందే త్రిపురలోనూ ఎన్నికలు జరిగాయి. దీంతో పలు సంస్థలు ఆ మూడు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. నాగాలాండ్ లో బీజేపీ, ఎన్డీపీపీకి తిరుగులేని మెజార్టీ వస్తుందని స్పష్టం చేశాయి.

Exit poll results: మేఘాలయా, నాగాలాండ్ లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇంతకు ముందే త్రిపురలోనూ ఎన్నికలు జరిగాయి. దీంతో పలు సంస్థలు ఆ మూడు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. నాగాలాండ్ లో బీజేపీ, ఎన్డీపీపీకి తిరుగులేని మెజార్టీ వస్తుందని స్పష్టం చేశాయి.

నాగాలాండ్ లో బీజేపీ, ఎన్డీపీపీ కూటమి తిరుగులేని మెజార్టీతో గెలుపొందుతుందని జీ న్యూస్-మాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ లో తేలింది. నాగాలాండ్ లో బీజేపీ, ఎన్డీపీపీ కూటమికి 35-43 మధ్య సీట్లు వస్తాయని, కాంగ్రెస్ కు 1-3 సీట్లు రావచ్చని, ఎన్డీఎఫ్ కు 2-5 మధ్య సీట్లు వస్తాయని అంచనా వేసింది.

నాగాలాండ్ లో బీజేపీ, ఎన్డీపీపీ కూటమికి 38-48 సీట్లు వస్తాయని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ లో తేలింది. కాంగ్రెస్ కు 1-2, ఎన్డీఎఫ్ కు 3-8 సీట్లు వస్తాయని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది.

మేఘాలయాలో..

మేఘాలయాలోని 60 సీట్లలో నేషనల్ పీపుల్స్ పార్టీ 21-26 సీట్లు గెలుచుకుంటుందని జీ న్యూస్-మాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ లో తేలింది. టీఎంసీ 8-13 మధ్య, బీజేపీ 6-11 మధ్య, కాంగ్రెస్ 3-6 మధ్య సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేసింది.

మేఘాలయాలోని నేషనల్ పీపుల్స్ పార్టీ 18-26 సీట్లు గెలుచుకుంటుందని టైమ్స్ నౌ-ఈటీజీ రీసెర్చ్ అంచనా వేసింది. బీజేపీకి 3-6 మధ్య, కాంగ్రెస్ 2-5 మధ్య సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేసింది.

మేఘాలయాలో నేషనల్ పీపుల్స్ పార్టీ 18-24 సీట్లు గెలుచుకుంటుందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియాలో తేలింది. బీజేపీ 4-8 మధ్య, కాంగ్రెస్ 6-12 మధ్య సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేసింది.

త్రిపురలో..
త్రిపురలోని 60 సీట్లలో బీజేపీ 36-45 మధ్య సీట్లు గెలుచుకుంటుందని  ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ లో తేలింది. వామపక్ష పార్టీలు 6-11 సీట్లు గెలుస్తాయని అంచనా వేసింది.

జీ న్యూస్-మాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ లోనూ బీజేపీ గెలుస్తుందని తేలింది. బీజేపీకి 29-36 సీట్లు వస్తాయని చెప్పింది. వామపక్ష పార్టీలు 13-21 మధ్య సీట్లు గెలుచుకుంటాయని జీ న్యూస్-మాట్రిజ్ తెలిపింది.

CM KCR : మనీశ్ సిసోడియా అరెస్ట్‌, నెక్ట్స్ ఎవరు?-సీఎం కేసీఆర్ హాట్ కామెంట్స్

ట్రెండింగ్ వార్తలు