ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వమే..ఎగ్జిట్ పోల్స్ తప్పు – మనోజ్ తివారీ

  • Publish Date - February 8, 2020 / 03:38 PM IST

దేశ రాజధానిలో బీజేపీ ప్రభుత్వమే వస్తుందని, ఎగ్జిట్ పోల్స్ అన్నీ విఫలమౌతాయంటున్నారు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ. 2020, ఫిబ్రవరి 08వ తేదీన 70 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5 గంటల వరకు 57.9 శాతం పోలింగ్ నమోదైంది.

సాయత్రం 6 గంటల అనంతరం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ప్రధాన సంస్థలు ఆప్‌కే పట్టం కట్టాయి. సుమారు 50-60 స్థానాల్లో విజయం సాధిస్తాయని చెప్పడంతో ఆప్ నేతలు, కార్యకర్తలు ఫుల్ ఖుష్ అయితున్నారు. రెండోసారి అధికారంలోకి వస్తున్నామన్న సంతోషం వారిలో కనిపిస్తోంది. 

కానీ..దీనిని ఖండిస్తున్నారు మనోజ్ తివారీ. హస్తినలో బీజేపీ ప్రభుత్వం పక్కాగా ఏర్పాటు చేస్తామని నొక్కానిస్తున్నారు. ఈవీఎంలను నిందించడానికి మాత్రం సాకులు వెతకొద్దని సూచించారు. బీజేపీ 48 సీట్లు గెలుస్తుందని చెబుతూ..ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌‌ను జాగ్రత్తగా సేవ్ చేసుకొండి అంటూ నెటిజన్లకు సలహాలు ఇచ్చేశారు. ఎన్నికల ఓటింగ్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీకి చెందిన ఏడుగురు ఎంపీలను ఢిల్లీకి చెందిన నాయకులు కలవడం జరుగుతుందన్నారు. 45కి పైగా సీట్లను పార్టీ గెలుచుకొనే విధంగా షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సుడిగాలి ప్రచారం చేసిన విషయానన్ని ఆయన గుర్తు చేశారు. 

* 70 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఆప్ ఘన విజయం సాధిస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 
* ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సీఎం పీఠాన్ని నిలుపుకుంటారని వెల్లడించాయి. 
* 2015 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ఆప్ 67 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. 
* తాజాగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమౌతాయా ? బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ చెప్పింది నిజమౌతాయా ? అనేది చూడాలంటే ఫిబ్రవరి 11 వరకు వెయిట్ చేయాల్సిందే.