కాశ్మీర్ లో బీజేపీ నాయకుడు కిడ్నాప్…రంగంలోకి దిగిన భద్రతా దళాలు

జమ్మూ కశ్మీర్ లో బీజేపీ నాయకులపై వరుస దాడులు జరుగుతున్నాయి .స్థానిక బీజేపీ నాయకుడిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది.

గత బుధవారం బందీపోరాలో బీజేపీ నాయకుడు షేక్ వసీమ్ బారి, అతని సోదరుడు, తండ్రిని ఉగ్రవాదులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ హత్యను బీజేపీ అగ్ర నాయకత్వం తీవ్రంగా ఖండించింది. తాజాగా మళ్లీ ఈ బుధవారం మరో బీజేపీ నాయకుడిని కిడ్నాప్‌ చేయడం గమనార్హం

బుధవారం(జులై-15,2020) బారాముల్లా మునిసిపల్ కమిటీ వాటర్‌గామ్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నా మెరాజుద్దీన్ మల్లాను నార్త్ కశ్మీర్‌లో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… మల్లా బుధవారం ఈ ప్రాంతంలో రోడ్డుపై వాకింగ్ చేస్తున్నపుడు కారులో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆయనను అపహరించి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతడి ఆచూకీ కోసం భద్రతా దళాలు భారీ ఎత్తున రంగంలోకి దిగాయి. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి