Chandana Bauri :పూరి గుడిసెలో నివాసం, భర్త కూలీ..ఎమ్మెల్యేగా గెలిచిన మహిళ

పూరి గుడిసెలో నివాసం ఉంటోంది..భర్త కూలీ పని వెళుతాడు.. ఎన్నికల పోటీలో తానెందుకు నిలవకూడదు అనుకుంది. ఎన్నికల కదనరంగంలోకి దూకింది. ప్రజలు ఆమెను ఆదరించారు. ఎమ్మెల్యేగా గెలిపించారు.

West Bengal

Trinamool Congress : పూరి గుడిసెలో నివాసం ఉంటోంది..భర్త కూలీ పని వెళుతాడు.. ఎన్నికల పోటీలో తానెందుకు నిలవకూడదు అనుకుంది. ఎన్నికల కదనరంగంలోకి దూకింది. ప్రజలు ఆమెను ఆదరించారు. ఎమ్మెల్యేగా గెలిపించారు. దీంతో ఆమె కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేవు. వెస్ట్ బెంగాల్ లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన చందనా బౌరీపై అందరి దృష్టి నెలకొంది.

వెస్ట్ బెంగాల్ లో జరిగిన ఎన్నికల్లో పాగా వేయాలని, మమతకు చెక్ పెట్టాలని బీజేపీ కన్న కలలు అడియాశలయ్యాయి. ఆ పార్టీ అక్కడ ఓడిపోయింది. అయితే..సాల్తోరా సీటు నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన చందనా బౌరీ..సమీప టీఎంసీ ప్రత్యర్థి సంతోష్ మండల్ ను ఓడించడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే..ఈమె జీవన విధానాన్ని అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆమె దాచుకున్న సొమ్ము కేవలం 31 వేల 985 రూపాయలేనని బీజేపీ నేత సునీల్ దేవఘర్ ట్వీట్ లో వెల్లడించారు.

ఈమె ఒక పూరి గుడిసెలో ఉంటోందని, భర్త కూలీ పనులకు వెళుతుంటాడని, వారి జీవనాధారం అదేనని తెలిపారు. ఆమె దగ్గర ప్రస్తుతం మూడు గొర్రెలు, మూడు ఆవులు ఉన్నాయని, ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంలో దాఖలు చేసిన అఫిడవిట్ లో బ్యాంకు ఖాతాలో కేవలం రూ. 6 వేల 335 ఉన్నాయని వెల్లడించారని తెలిపారు. ఇక తన భర్త ఖాతాలో కేవలం వేయి 561 ఉన్నాయని, భర్తకు ఎలాంటి భూమి లేదని అఫిడవిట్ లో వెల్లడించారు. భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ కూలి ప‌నులు చేస్తూ జీవ‌నం సాగ‌స్తున్నారు. ఈమె ఎమ్మెల్యేగా గెలిచి అందరి దృష్టిని ఆకర్షించారు.

Read More : Etela Rajender : ఈటల నెక్ట్స్ స్టెప్ ఏంటీ ? ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా ?