Prophet Comments Row: ప్రవక్తపై కామెంట్ల తర్వాత బీజేపీలో కొత్త రూల్స్

మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై అధికార ప్రభుత్వం అంతర్జాతీయంగా భారీ ప్రతిఘటనను ఎదుర్కొంటుంది. ఈక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధులు, టీవీ చర్చల్లో పాల్గొనే నాయకులకు కొత్త రూల్స్ విధించింది.

 

 

Prophet Comments Row: మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై అధికార ప్రభుత్వం అంతర్జాతీయంగా భారీ ప్రతిఘటనను ఎదుర్కొంటుంది. ఈక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధులు, టీవీ చర్చల్లో పాల్గొనే నాయకులకు కొత్త రూల్స్ విధించింది.

అధికార ప్రతినిధులు, ప్యానలిస్టులు మాత్రమే టీవీ చర్చల్లో పాల్గొనాలని నిర్దేశించింది. మీడియా సెల్ వారికి మాత్రమే కేటాయించబడుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఏ మతాన్ని గానీ, దాని తాలూకు చిహ్నాలను గానీ కించపరిచేలా, మతపరమైన వ్యక్తులను విమర్శించేలా వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించారు.

హాట్ హాట్ చర్చల సమయంలో బీజేపీ ప్యానలిస్టులు హద్దులు దాటడాన్ని నిషేదించారు. తమ భాషను అదుపులో ఉంచుకోవాలని, ఆందోళనకు, ఉద్వేగానికి గురికావద్దని వెల్లడించారు. ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలుచేసినా.. పార్టీ సిద్ధాంతాలను, ఆదర్శాలను ఉల్లంఘించకుండా ఉండాలని స్పష్టం చేశారు.

Read Also: బీజేపీ ద‌గ్గ‌ర స‌మాధాన‌మే లేదు: రాహుల్ గాంధీ

టీవీ చర్చకు సంబంధించిన అంశాన్ని ముందుగా తెలుసుకుని, దానికి సిద్ధం కావాలని బిజెపి అధికార ప్రతినిధులకు సూచించింది.

“పార్టీ అధికార ప్రతినిధులు, ప్యానలిస్టులు ఎజెండాలో ఉండాలి. వారు ఎలాంటి ఉచ్చులో పడకూడదు” అని వర్గాలు తెలిపాయి.

ట్రెండింగ్ వార్తలు