India’s economic slowdown: బీజేపీ ద‌గ్గ‌ర స‌మాధాన‌మే లేదు: రాహుల్ గాంధీ

India’s economic slowdown: బీజేపీ ద‌గ్గ‌ర స‌మాధాన‌మే లేదు: రాహుల్ గాంధీ

Rahul Gandhi

India’s economic slowdown: భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ ఎదుర్కొంటున్న‌ ప‌రిస్థితుల‌ను ప్ర‌స్తావిస్తూ కేంద్ర స‌ర్కారుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ద్ర‌వ్యోల్బ‌ణం, ఉద్యోగాలు, ప్ర‌జ‌ల‌ త‌ల‌స‌రి ఆదాయం గురించి కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఆయ‌న నిల‌దీశారు. కేంద్ర ప్ర‌భుత్వ విధానాల వ‌ల్ల దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ కుదేలవుతోంద‌ని ఆయ‌న అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేశారు.

Asaduddin Owaisi: నుపూర్ శ‌ర్మ‌ను అరెస్టు చేయాల్సిందే: అస‌దుద్దీన్ ఒవైసీ

”ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగిపోతుండ‌డం, ఉద్యోగాలు కోల్పోతుండ‌డం, రెండేళ్ల క్రితం ఉన్న త‌ల‌సరి ఆదాయం కంటే ఇప్పుడు త‌క్కువ‌గా త‌ల‌స‌రి ఆదాయం ఉండడంతో భార‌తీయ కుటుంబాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయి. దేశ త‌ల‌స‌రి ఆదాయం స్థిర ధ‌ర‌ల్లో రూ.94,270 నుంచి రూ.91,481కి దిగ‌జారింది. ఓ వైపు భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ దిగ‌జారుతోంది. మ‌రోవైపు దేశాన్ని దివాళా తీయించే విధానాలు పాటిస్తోన్న‌ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర స‌ర్కారు మాత్రం దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ఎలాంటి స‌మాధాన‌మూ చెప్ప‌డం లేదు. దేశ ఆర్థిక ప‌రిస్థితి మ‌రింత దిగ‌జార‌నుంది” అని రాహుల్ గాంధీ విమ‌ర్శ‌లు గుప్పించారు.

Language War: హిందీ భాష అభివృద్ధి చెంద‌ని రాష్ట్రాల‌ది: డీఎంకే ఎంపీ

కాగా, దేశంలో పెరుగుతున్న నిత్యావ‌స‌ర ధ‌రల‌ను ప్ర‌స్తావిస్తూ కేంద్ర ప్ర‌భుత్వంపై కాంగ్రెస్ తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తోంది. ఆర్థిక వ్య‌వ‌స్థ ఎప్పుడు గాడిలో ప‌డుతుంద‌న్న విష‌యాన్ని బీజేపీ స‌ర్కారు చెప్ప‌లేక‌పోతోంద‌ని, ప్ర‌భుత్వం స‌రైన ఆర్థిక విధానాల‌ను పాటించ‌డం లేద‌ని పేర్కొంది.