Asaduddin Owaisi: నుపూర్ శర్మను అరెస్టు చేయాల్సిందే: అసదుద్దీన్ ఒవైసీ

Asaduddin Owaisi: భారత్‌లో ముస్లింల పట్ల ప్రదర్శిస్తోన్న వైఖరి సరికాదంటూ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) జనరల్ సెక్రటేరియట్ చేసిన ప్రకటనను భారత్ ఖండించిన విషయంపై అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకురాలు నురూప్ శర్మతో పాటు ఆ పార్టీకి చెందిన నవీన్ కుమార్ జిందాల్ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఓఐసీ చేసిన ప్రకటనపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం 20 కోట్ల ముస్లింల ఆందోళన గురించి మాత్రం ఎందుకు స్పందించలేదని అసదుద్దీన్ నిలదీశారు.
Language War: హిందీ భాష అభివృద్ధి చెందని రాష్ట్రాలది: డీఎంకే ఎంపీ
”అరబ్ ప్రపంచం ముందు భారత్ అపఖ్యాతి పాలైంది. భారత విదేశాంగ విధానం నాశనమైంది. నుపూర్ శర్మను అరెస్టు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఆమెపై బీజేపీ కేవలం సస్పెన్షన్ వేటు వేసి వదిలేయడం సరికాదు. అలాగే, భారత విదేశాంగ శాఖ ఏమైనా బీజేపీలో భాగమైపోయి పనిచేస్తుందా? ఒకవేళ గల్ఫ్ దేశాల్లో భారతీయులపై విద్వేషపూరిత నేరాలు, హింస చెలరేగితే ఏం చేస్తారు? బీజేపీ ఉద్దేశపూర్వకంగానే తమ నేతలతో అనుచిత వ్యాఖ్యలు చేయిస్తుంది. అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలు వస్తేనే తమ నేతలపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటుంది” అని అసదుద్దీన్ చెప్పారు.
Rajya Sabha Polls: ఓటు వేస్తా.. ఒక్కరోజు బెయిల్ ఇవ్వండి: మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్
”20 కోట్ల మంది భారతీయ ముస్లింల మనో భావాలు దెబ్బతిన్నాయి. వారి ఆందోళనపై కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. విదేశాల నుంచి విమర్శలు వస్తే మాత్రం మోదీ సర్కారు భయపడిపోయింది. గల్ప్ దేశాల్లో భారతీయులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి అని అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు. కాగా, భారత్‌లో ముస్లింల పట్ల విద్వేషాన్ని ప్రదర్శిస్తున్నారని ఓఐసీ పేర్కొంది. దీనిపైనే భారత్ ఘాటుగా స్పందిస్తూ ఇటువంటి తప్పుడు ప్రచారం చేయొద్దని, అన్ని మతాలను గౌరవించాలని ఓఐసీకి బదులిచ్చింది” అని అసదుద్దీన్ ట్వీట్ చేశారు.