Rakesh Jhunjhunwala : తక్కువ ధరకే విమాన టికెట్, ఆకాశ నుంచి బోయింగ్‌కు రూ.75,000 కోట్ల ఆర్డరు ?

భారత బిలియనీర్, స్టాక్ మార్కెట్ లో నిపుణుడిగా పేరొందిన రాకేష్ ఝున్ ఝున్ వాలా తక్కువ ధరతో సామాన్యుడికి సైతం విమాన ప్రయాణం అందించాలని ప్రయత్నం చేస్తున్నారు.

Akasa Air : భారత బిలియనీర్, స్టాక్ మార్కెట్ లో నిపుణుడిగా పేరొందిన రాకేష్ ఝున్ ఝున్ వాలా తక్కువ ధరతో సామాన్యుడికి సైతం విమాన ప్రయాణం అందించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు స్టార్టప్ ఎయిర్ లైన్ ‘ఆకాశ ఎయిర్’ పేరిట ప్రయత్నాలు జరుపుతున్నారు. అందులో భాగంగా..సివిల్ ఏవియేషన్ నుంచి అనుమతులు కూడా పొందింది.

Read More : Prime Minister Modi : ఈ పథకాలు సురక్షితం…పెట్టుబడి పరిధిని విస్తరిస్తాయి

ఇప్పుడు ఆకాశ నుంచి బోయింగ్ కు రూ. 75 వేల కోట్ల ఆర్డర్ వెళ్లిందని ప్రచార జరుగుతోంది. 70 నుంచి 80 దాక (737 మ్యాక్స్) విమానాలకు సంబంధించి..ఒప్పందం కుదుర్చోకోనుందని తెలుస్తోంది. దుబాయ్ ఏయిర్ షోలో బోయింగ్ సంస్థతో ఒప్పందం గురించి ఆకాశ సంస్థ ప్రకటించే అవకాశం ఉందని వార్త సంస్థ బ్లూమ్ బర్గ్ పేర్కొంది.

Read More : NARA LOKESH: కుప్పం చంద్రబాబు అడ్డా.. వైసీపీ అరాచకాలు చేస్తుంది -నారా లోకేష్
కానీ..ఈ ఒప్పందం విషయంలో ఆకాశ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. బోయింగ్ ఆర్డర్ పొందితే మాత్రం..భారత్ లో ఉన్న ఎయిర్ బస్ సంస్థ అధిపత్యానికి గండి పడినట్లేనని భావిస్తున్నారు. మరి..సామాన్యుడికి తక్కువ ధరకే విమాన ప్రయాణం అందించాలనే ఆకాశ ప్రయత్నం నెరవేరుతుందా ? లేదా ? అనేది చూడాలి.

ట్రెండింగ్ వార్తలు