Bonalu Celebrations : తెలంగాణ భవన్‌లో ఘనంగా బోనాల ఉత్సవాలు

దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ భవన్‌లో రెండు రోజుల పాటు లాల్‌ దర్వాజా సింహవాహిని దేవాలయం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

Bonalu Celebrations In Delhi Telangana Bhavan : దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ భవన్‌లో రెండు రోజుల పాటు లాల్‌ దర్వాజా సింహవాహిని దేవాలయం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు బుధవారం (జూలై 14) ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి కిషన్‌రెడ్డి హాజరై అమ్మవారికి పట్టువస్రాలు సమర్పించారు.

అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలను ఆలయ కమిటీ నిర్వహిస్తూ వస్తుంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఢిల్లీలో బోనాల ఉత్సవాలు నిర్వహించినట్టు కిషన్ రెడ్డి చెప్పారు. ఏడు ఏళ్లుగా ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలను ఆలయ కమిటీ నిర్వహిస్తూ వస్తుందన్నారు.

బోనాలు పండుగను కేంద్ర ప్రభుత్వ ప్రముఖ పండుగల జాబితాలో చేర్చేలా కృషి చేస్తానని చెప్పారు. కరోనా మహమ్మారి నుంచి విముక్తి లభించాలని అమ్మవారిని ప్రార్ధిస్తున్నానని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న టీఆర్‌ఎస్‌ ఎంపీ బండా ప్రకాశ్‌ ఫోటో ఎగ్జిబిషన్‌ ప్రారంభించారు. ప్రతి ఏడాది ఢిల్లీలో బోనాల ఉత్సవాలను లాల్‌ దర్వాజా సింహవాహిని దేవాలయం కమిటీ ఘనంగా నిర్వహిస్తుందని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు