న్యూఢిల్లీ : దూర ప్రాంతాలకు వెళ్లేందుకు చాలా మంది రైళ్లను ఆశ్రయిస్తుంటారు. ముందుగానే టికెట్లు బుక్ చేయించుకుని ప్రయాణం చేస్తారు. ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో మాత్రం సమాచారం తెలియదు. పౌర విమానయాన సంస్థ వెబ్‌సైట్‌లో మాత్రం విమానంలో ఎన్ని సీట్లు బుక్ అయ్యాయి ? ఇంకా ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయో చూపిస్తుంది. రైల్వేలో కూడా ఇలాంటి ఆప్షన్ ఇస్తే ఎలా ఉంటుందని రైల్వే శాఖ ఆలోచిస్తోంది.
రిజర్వేషన్ చార్టులు…
ఎయిర్ లైన్స్ తరహాలో సీటును బుక్ చేసే వెసులుబాటు తేవాలని యోచిస్తోంది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సీఆర్ఐఎస్) సాయంతో రిజర్వేషన్ చార్టులను ప్రజలకు అందుబాటులో తేవాలని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.
కష్టమంటున్న సీనియర్ అధికారులు…
మరి ఇది ఆచరణ సాధ్యమేనా అంటే..కష్టమని సీనియర్ అధికారులు పేర్కొంటున్నారంట. విమానం ఆయా గమ్యస్థానాలకు నేరుగా ఉంటుంది. సీట్లు ఖాళీ అయ్యే ఛాన్స్ ఉండదు. అదే రైలులో మాత్రం వివిధ స్టేషన్‌లలో ప్రయాణీకులు దిగుతుంటారు…ఎక్కుతుంటారని పేర్కొంటున్నారు. సీట్ల రిజర్వేషన్ చార్టులు స్టేషన్..స్టేషన్‌కి మారుతాయి..సో…కొత్త వ్యక్తి చెక్ చేసుకుని బుక్ చేసుకోవడం చాలా కస్టమని వ్యాఖ్యానిస్తున్నారు. మరి రైల్వే మంత్రి ఆదేశాలు ఆచరణ సాధ్యమౌతుందా ? లేదా ? అనేది చూడాలి.