tattoo artist : పచ్చబొట్టు కోసం ముక్కును కోసుకున్నాడు

  • Publish Date - September 27, 2020 / 01:27 PM IST

Michel Tattoo Artist : శరీరంపై పచ్చబొట్టు కోసం సాహసాలే చేస్తున్నారు కొంతమంది. ఇటీవలే ఒకతను చెవులు అడ్డుగా వస్తున్నాయనే కారణంగా..వాటిని కోసుకుని ఓ జారులో భద్రంగా దాచుకున్నాడు. ఇది మరిచిపోక ముందే..మరొకరు..ఏకంగా ముక్కును కోసేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఓ వార్త హల్ చల్ చేస్తోంది.

ఈ కొత్త రూపాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ప్ర‌పంచానికి త‌న పేరును ‘డెవిల్ ప్రాడో’గా ప‌రిచ‌యం చేసుకుంటున్నాడు.
ఇక ఇతని విషయానికి వస్తే..మైకెల్ ఫ‌రోడో ప్రాడో ఇతను బ్రెజిల్ దేశానికి చెందిన ఇతను టాటూ ఆర్టిస్టు. భార్య, స్నేహితులు కూడా టాటూ ఆర్టిస్టులే కావడం విశేషం. శరీరమంతా పచ్చబొట్లు వేయించుకున్నాడు.

కానీ ఎక్కడో లోటు ఉందని అనుకొనే వాడు. ఎన్నో ఆపరేషన్లు చేయించుకున్నాడు. ఎవరూ చేయని విధంగా చేయాలని అనుకున్నాడు. అంతే…సైతాన్ లా అవతరించాడు. ముక్కును కూడా తొలగించుకున్నాడు. అంతేకాదండోయ్…కళ్లలోని తెల్లగుడ్డును సైతం నల్లగా మార్చేసుకున్నాడు.

తల మీద కొమ్ములు పెట్టుకుని కోసేసుకుని ముక్కుతో ఫొటోలు తీయించుకుని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. నిజంగానే దయ్యంలా ఉన్నాడని అంటున్నారు. ఎవరి పిచ్చి వారికి ఆనందం అని అంటున్నారు కొంతమంది.