Sukhoi, Mirage Aircraft Crash : మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన సుఖోయ్, మిరాజ్ యుద్ధ విమానాలు

మధ్యప్రదేశ్ లో రెండు యుద్ధ విమానాలు కుప్పకూలాయి. శనివారం (జనవరి 28,2023) సుఖోయ్-30, మిరాజ్ 200 విమానాలు మధ్యప్రదేశ్ లోని మొరెనా సమీపంలో కుప్పలకూలాయి.

Sukhoi-30, Mirage 2000 aircraft crash

Sukhoi, Mirage Aircraft crash in Madhya Pradesh : మధ్యప్రదేశ్ లో రెండు యుద్ధ విమానాలు కుప్పకూలాయి. శనివారం (జనవరి 28,2023) సుఖోయ్-30, మిరాజ్ 200 విమానాలు మధ్యప్రదేశ్ లోని మొరెనా సమీపంలో కుప్పలకూలాయి. ఈ సమాచారంతో అందుకున్న సంబంధిత సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయం చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ ఎయిర్ బేస్ నుంచి రెండు యుద్ధ విమానాలు టేకాఫ్ తీసుకున్నాయి. అనంతరం మధ్యప్రదేశ్ లోని మెరెనా సమీపంలో కుప్పకూలగా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. కాగా సాంకేతిక లోపంతో ఈ ప్రమాదం జరిగిందా? మరేదైనా కారణమా? అనే విషయం తెలియాల్సి ఉంది.