Bride Firing: గాల్లోకి పెళ్లి కూతురు కాల్పులు.. కేసు నమోదు
పెళ్ళిలో సంబరాలు చేసుకోవడం కామన్.. అయితే కొందరు అత్యుత్సాహంతో మారణాయుధాలతో సంబరాలు చేసుకుంటారు. కొందరు తల్వార్లను తిప్పుతూ ప్రదర్శన చేస్తే, మరికొందరు ఏకంగా గన్ తో గాల్లోకి కాల్పులు జరుపుతుంటారు.
Bride Firing: పెళ్ళిలో సంబరాలు చేసుకోవడం కామన్.. అయితే కొందరు అత్యుత్సాహంతో మారణాయుధాలతో సంబరాలు చేసుకుంటారు. కొందరు తల్వార్లు తిప్పుతూ ప్రదర్శన చేస్తే, మరికొందరు ఏకంగా గన్ తో గాల్లోకి కాల్పులు జరుపుతుంటారు. గతంలో ఇటువంటి ఘటనలు చాలానే జరిగాయి.
ఇక తాజాగా ఓ వధువు తన పెళ్ళిలో గన్ తో గాల్లోకి కాల్పులు జరిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్ ప్రతాప్ ఘర్ జిల్లాలోని జెథ్వారా ఏరియాకు చెందిన రూపా పాండే వివాహం తాజాగా జరిగింది. ఈ పెళ్ళిలో వధువు రూపా పాండే వివాహ వేదిక ఎక్కుతూ గన్ తో గాల్లోకి కాల్పులు జరిపింది. ఈ దృశ్యాలను కెమెరాలో బంధించిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారి పోలీసుల కంటపడింది.
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రూపా పాండే కాల్పులు జరిపిన రివాల్వర్ ఆమె మామ రామ్ నివాస్ పాండేది అని పోలీసులు గుర్తించారు. రూపా పాండే, ఆమె మామ రామ్ నివాస్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
सोशल मीडिया पर 30 मई का वीडियो वायरल है. प्रतापगढ़ के जेठवारा थाना क्षेत्र के लक्ष्मण का पुरवा में दुल्हन ने स्टेज पर चढ़ने के पहले अपने चाचा की लाइसेंसी रिवॉल्वर से हर्ष फायर किया. पुलिस ने नई दुल्हन रूपा पांडेय और चाचा रामनिवास पांडेय के खिलाफ मामला दर्ज कर जांच शुरू कर दी है. pic.twitter.com/lWYkL7vlVK
— The Lallantop (@TheLallantop) June 1, 2021