ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో మూడు ముళ్లేయాల్సిన సమయంలో ఓ పెళ్లి కుమారుడు పెళ్లి కొడుకు పీటలు ఎక్కటం మానేసి నిరసన దీక్షలో కూర్చున్నాడు. ఆదివారం రాత్రి (డిసెంబర్ 1) జరిగిన ఈ ఘటనలో పెళ్లి కొడుకు కట్నం గురించి డిమాండ్ చేయటానికి అలా చేయలేదు. ఓ మంచి పనికోసం అలా చేశాడు.
వివారాల్లోకి వెళితే..ఉత్తరప్రదేశ్‌లోని మహోబా ప్రాంతంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌తో పది రోజులుగా యువకులు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 1న రాత్రి పెళ్లి చేసుకోవడానికి మహోబాకు ఊరేగింపుగా వచ్చిన పెళ్లి కొడుకు ఏంటీ మీరు ఇలా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు ఎందుకు? అని అడిగాడు.దానికి వారు మెడికల్ కాలేజ్ కోసం చేస్తున్నామని చెప్పారు.
దీంతో మహోబా ప్రాంతంలో మెడికల్ కాలేజీ అవసరం గురించి దాని ప్రయోజనాలు తెలుసుకున్న అతను..వారికి మద్దతుగా నిరసన దీక్షలో కూర్చున్నాడు. దీంతో ప్రస్తుతం ఆ పెళ్లి కుమారుడికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆ తరువాత పెళ్లికొడుకు వివాహం కూడా అయ్యింది. ఆ వివాహానికి నిరసన కార్యక్రమాలు చేస్తున్న యువకులు కూడా వచ్చారు. మా కోసం పెళ్లి చేసుకోవాల్సిన సమయంలో తమకు మద్ధతునిచ్చిందుకు వారంతా పెళ్లికి హాజరై తమ ఆనందాన్ని వ్యక్తంచేశారు.