Mahender Kaur – Sheikh Abdul : విడిపోయిన అక్కాతమ్ముుడు 75ఏళ్ల తర్వాత కలుసుకున్నారు.. అక్క భారత్ లో.. తమ్ముడు పాకిస్థాన్ లో

సర్దార్ భజన్ సింగ్ కుటుంబం భారత్ లోని పంజాబ్ లో నివసించేది. అయితే, దేశ విభజన సమయంలో మహేందర్ కౌర్ తండ్రితో భారత్ లోనే ఉండిపోగా, తప్పిపోయిన షేక్ అబ్దుల్ అజీజ్ పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ కు వెళ్లిపోయారు.

Khartarpur Corridor : దేశ విభజన సమయంలో విడిపోయిన అక్కాతమ్ముుడు 75 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు. భారత్ లో ఉంటున్న మహేందర్ కౌర్(81), పాకిస్తాన్ లోని ఆక్రమిత కాశ్మీర్ లో ఉంటున్న షేక్ అబ్దుల్ అజీజ్ (78) అక్కాతమ్ముళ్లు ఒకరినొకరు చూసుకుంటూ ఆనంద భాష్పాలు రాల్చారు. తన తమ్ముడిని చూసి ఆలింగనం చేసుకున్న మహేందర్ కౌర్ అతని చేతిపై ముద్దాడారు. ఇరు కుటుంబాల సభ్యులు పాటలు పాడుతూ, వారిపై పూల వర్షం కురిపించారు. ఈ అరుదైన ఘటన ఖర్తార్ పూర్ కారిడార్ లో చోటు చేసుకుంది.

సర్దార్ భజన్ సింగ్ కుటుంబం భారత్ లోని పంజాబ్ లో నివసించేది. అయితే, దేశ విభజన సమయంలో మహేందర్ కౌర్ తండ్రితో భారత్ లోనే ఉండిపోగా, తప్పిపోయిన షేక్ అబ్దుల్ అజీజ్ పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ కు వెళ్లిపోయారు. అక్కడే అతను వివాహం చేసుకుని నివసిస్తున్నారు. కానీ, నిత్యం భారత్ లోని తన తల్లిదండ్రులు, సోదరి, బంధువులు కోసం పరితపించేవాడు.

Giriraj Singh : ముస్లింలను అప్పుడే పాకిస్థాన్‌కు పంపించేసి ఉండాల్సింది : కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్

కాలక్రమేణా కుటుంబ సభ్యుల గురించి ఆశలు వదులుకున్నాడు. అయితే, సోషల్ మీడియాలో వచ్చిన పోస్టు కారణంగా తన వారిని గుర్తించాడు. దీంతో తన తోబుట్టువును కులుసుకునేందుకు వచ్చాడు. వీల్ చైర్ ల మీద వచ్చిన అక్కాతమ్ముడు కలిసిన ఉద్విగ్న దృశ్యాలను ఇరు కుటుంబాలు సంతోషంగా వేడుక జరుపుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు