Cross-Border Tunnel : దేశ సరిహద్దుల్లో బ‌య‌ట‌ప‌డ్డ రహస్య సొరంగం.. బీఎస్ఎఫ్ అలర్ట్..!

Cross-Border Tunnel : జ‌మ్మూ క‌శ్మీర్‌లోని సాంబా ప్రాంతంలో ఓ సొరంగం బ‌య‌ట‌ప‌డింది. బీఎస్ఎఫ్ అధికారులు గ‌స్తీ తిరుగుతుండ‌గా ఈ సొరంగం బ‌య‌ట‌ప‌డింది.

Cross-Border Tunnel : జ‌మ్మూ క‌శ్మీర్‌లోని సాంబా ప్రాంతంలో ఓ సొరంగం బ‌య‌ట‌ప‌డింది. బీఎస్ఎఫ్ అధికారులు గ‌స్తీ తిరుగుతుండ‌గా ఈ సొరంగం బ‌య‌ట‌ప‌డింది. ఇది పాకిస్తాన్ స‌రిహ‌ద్దుకి అత్యంత స‌మీపంలోనే వుండ‌టంతో అధికారులు అల‌ర్ట్ అయ్యారు. కొన్ని రోజుల క్రితం జ‌రిగిన పాక్ అక్ర‌మ చొర‌బాట్లు ఇదే సొరంగం గుండా జ‌రిగింద‌ని ఆర్మీ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చింది. ఈ వ్య‌వ‌హారంపై బీఎస్ఎఫ్ పీఆర్వో స్పందించారు. సాంబా ప్రాంతంలోని బాడ్ ఏరియాలో ఓ సొరంగం బ‌య‌ట‌ప‌డింది. దీంతో అల‌ర్ట్ అయ్యాయి. విస్తృతంగా గాలింపు చ‌ర్య‌లు కూడా చేస్తున్నాం. అంత‌ర్రాష్ట్రీయ స‌రిహ‌ద్దుల‌కు అత్యంత స‌మీపంలోనే ఈ సొరంగం వుంది. తాజాగా జ‌రిగిన అక్ర‌మ చొర‌బాట్లు ఈ సొరంగం ద్వారా జ‌రిగాయ‌ని మాకు అనుమానాలు వున్నాయి అని పేర్కొన్నారు.

దేశ సరిహద్దుల్లోకి పాకిస్థాన్ నుంచి చొరబడిన జైషే మహ్మద్ (Jm) సంస్థకు చెందిన ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లను భద్రతా బలగాలు కాల్చిపారేశారు. ఈ ఘటన జరిగిన దాదాపు 15 రోజుల తర్వాత జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో అనుమానాస్పద భూగర్భ క్రాస్-బోర్డర్ సొరంగాన్ని బీఎస్ఎఫ్ గుర్తించింది. ఈ మేరకు బీఎస్ఎఫ్ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. BSF (జమ్మూ) డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ SPS సంధు మాట్లాడుతూ.. సాంబాలోని ఫెన్సింగ్‌కు సమీపంలో ఉన్న ఒక సాధారణ ప్రాంతంలో అనుమానాస్పద సొరంగాన్ని గుర్తించామన్నారు. చీకటి కారణంగా ఆ సొరంగాన్ని లోతుగా పరీక్షించలేదని చెప్పారు. మరుసటి ఉదయాన్నే ఆ సొరంగాన్ని పూర్తిగా శోధించనున్నట్టు ఆయన చెప్పారు. ఆ అనుమానిత సొరంగానికి సంబంధించిన కొన్ని ఫొటోలను ఆయన షేర్ చేశారు.కొన్ని రోజుల క్రితమే పాక్ అక్రమ చొరబాట్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోకి చొరబడేందుకు ఈ సొరాంగాన్ని తవ్వి ఉంటారని ఆర్మీ అధికారులు భావిస్తున్నారు.

Bsf Detects Suspected Underground Cross Border Tunnel In J&k’s Samba 

అప్రమత్తమైన ఆర్మీ అధికారులు ఆ సొరంగం ఎక్కడ నుంచి మొదలైందో తెలుసుకునేందుకు విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. అంతరాష్ట్రీయ సరిహద్దులకు అతిసమీపంలోనే ఈ సొరంగం ఉందని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన పాక్ చొరబాట్లు ఈ సొరంగం ద్వారానే జరిగి ఉంటాయని ఆర్మీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ రోజు (బుధవారం) సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో చక్ ఫక్విరా సరిహద్దు ఔట్‌పోస్ట్ ప్రాంతంలో కొనసాగుతున్న యాంటీ టన్నెలింగ్ డ్రైవ్‌లో బీఎస్ఎఫ్ బలగాలు ఈ అనుమానాస్పద సొరంగంను గుర్తించినట్లు BSF వర్గాలు వెల్లడించాయి.

IB నుంచి 150 మీటర్ల దూరంలో సరిహద్దు కంచె నుంచి 50 మీటర్ల దూరంలో కొత్తగా తవ్విన సొరంగం పాకిస్తాన్ పోస్ట్ చమన్ ఖుర్ద్ (ఫియాజ్) ఎదురుగా ఉందని గుర్తించారు. భారత్ వైపు నుంచి 900 మీటర్ల దూరంలో ఉందని ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు. సరిహద్దు అవుట్‌పోస్ట్ చక్ ఫక్విరా నుంచి 300 మీటర్ల దూరంలో చివరి భారతీయ గ్రామం నుంచి 700 మీటర్ల దూరంలో సొరంగం ప్రారంభం అవుతుందని ఆయన అన్నారు.

Read Also :  Pakistan Man Crossed Border : భారత్ లో ప్రేయసి కోసం..బోర్డర్ దాటిన పాక్ యువకుడు అరెస్ట్

ట్రెండింగ్ వార్తలు