BSF GD Constable Recruitment : టెన్త్ అర్హతతో ఉద్యోగం, రూ.69వేలు జీతం

కేంద్ర హోం శాఖ ఆధీనంలోని సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) కానిస్టేబుల్‌ జనరల్‌ డ్యూటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Bsf Gd Constable Recruitment 2021

BSF GD Constable Recruitment 2021 : కేంద్ర హోం శాఖ ఆధీనంలోని సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) కానిస్టేబుల్‌ జనరల్‌ డ్యూటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 9 నుంచి ప్రారంభం కానుంది. ఆసక్తి, అర్హత ఉన్న ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మహిళా, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతానికి తాతాల్కికంగా ఉద్యోగంలో తీసుకుంటారు. భవిష్యత్తులో పర్మినెంట్ చేసే అవకాశం ఉంది.

మొత్తం పోస్టులు: 269

అర్హత: మెట్రిక్యుల్యేషన్‌ లేదా దానికి సమానమైన కోర్సు చేసి ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

ఎత్తు: పురుషులు- 170 సెంటీమీటర్లు, మహిళలు 157 సెంటీమీటర్లు

ఛాతీ: 85 సెంటీమీటర్లు

ఎంపిక ప్రక్రియ: శారీరక దారుఢ్యం, అకడమిక్‌ మార్కులు, వైద్య పరీక్షల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 9

దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్‌ 22

జీతం : రూ.69,100

వెబ్‌సైట్‌: https://bsf.gov.in/