దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లోక్ సభ తొలి దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఏప్రిల్ 11, 2019 గురువారం ఉత్తరప్రదేశ్ లోని కరానా లోక్ సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికల పోలింగ్ లో ఉద్రిక్తత నెలకొంది.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లోక్ సభ తొలి దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఏప్రిల్ 11, 2019 గురువారం ఉత్తరప్రదేశ్ లోని కరానా లోక్ సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికల పోలింగ్ లో ఉద్రిక్తత నెలకొంది. రసల్ పూర్ సమీపంలో ఏర్పాటు చేసిన షామ్లి పోలింగ్ బూత్ దగ్గర బీఎస్ఎఫ్ జవాన్లు లాఠీఛార్జ్ చేశారు. గాల్లోకి కాల్పులు జరిపారు. ఫేక్ ఓటింగ్ జరుగుతున్నట్టు పుకార్లు రావడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.
పోలింగ్ బూత్ దగ్గర క్యూలో నిలబడిన కొందరు ఓటర్లు ఓటరు గుర్తింపు కార్డు చూపించకుండా ఓటు వేసేందుకు ప్రయత్నించారు. దీంతో భద్రతా సిబ్బందికి గ్రామ ఓటర్లకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో భద్రతా సిబ్బందిపై గ్రామ ప్రజలు రాళ్లు రువ్వారు. దీంతో బీఎస్ఎఫ్ జవాన్లు లాఠీఛార్జ్ చేశారు. జనాన్ని చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు.
ప్రజలకు నచ్చజెప్పి, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసు అధికారులు ప్రయత్నించారు. రసూల్ పూర్ గుర్జన్ గ్రామంలోని కందాలా పోలీసు స్టేషన్ లో ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఓటింగ్ ప్రక్రియ నిలిచిపోయినట్టు సమాచారం. ఒక గణాంకం ప్రకారం.. కరానాలో మొత్తం 16.48 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 5లక్షల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు.
Lathi-charge, aerial firing and violence reported from Kandhla in Kairana Lok Sabha seat. Villagers claim that the security forces obstructed their voting and beat them up @Uppolice @shamlipolice pic.twitter.com/QiKyCntv36
— Amil Bhatnagar (@AmilwithanL) April 11, 2019