Draupadi murmu : NDA రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపిన BSP

బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు బీఎస్పీ మద్దతు ప్రకటించింది. బీఎస్పీ (Bahujan Samaj Party) చీఫ్‌ మాయావతి రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఎంపీలు ద్రౌపది ముర్మకి ఓట్లు వేస్తారని తెలిపారు.

BSP support for NDA presidential candidate draupadi murmu : బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు బీఎస్పీ మద్దతు ప్రకటించింది. బీఎస్పీ (Bahujan Samaj Party) చీఫ్‌ మాయావతి రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఎంపీలు ద్రౌపది ముర్మకి ఓట్లు వేస్తారని తెలిపారు.ఈ నిర్ణయం బీజేపీ, ఎన్‌డిఎకు మద్దతుగా లేదా ప్రతిపక్షానికి వ్యతిరేకంగా తీసుకోలేదని మాయావతి స్పష్టంచేశారు.

మా పార్టీని,మా సిద్ధాంతాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని.. ‘ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతివ్వాలని తాము నిర్ణయించాం అని తెలిపారు. తాము బీజేపీకి గానీ, ఎన్డీయేకి గానీ మద్దతు ఇవ్వడంలేదని తెలిపారు. అలాగని ప్రతిపక్షాలకూ వ్యతిరేకం కాదు. పార్టీ విధానాలను దృష్టిలో ఉంచుకుని ఈమేరకు నిర్ణయం తీసుకున్నాం’ అని మాయావతి చెప్పారు. కాగా..మద్దతు అంశంపై ప్రతిపక్షాలు తమను సంప్రదించలేదని వెల్లడించారు.

కాగా..బీజేపీ అధిష్టానం ఎంతగానో ఆలోంచి తమ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ప్రకటించింది. ఈ క్రమంలో ద్రౌపది ముర్ము శుక్రవారం (జూన్ 24,2022) నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేయడంపై దేశంలో అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయని ప్రధాని మోడీ అన్నారు. క్షేత్రస్థాయి సమస్యలపై ఆమెకు మంచి అవగాహన ఉందని, దేశాభివృద్ధిపై అద్భుతమైన ముందుచూపు ఉందని ట్విటర్‌లో ప్రశంసించారు. NDA రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన ద్రౌపది ముర్ము నిన్న ఢిల్లీ చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు.

 

 

ట్రెండింగ్ వార్తలు