Rambai Singh : లంచం ఇస్తే తీసుకోండి.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

అధికారులు ఇచ్చినంత లంచం తీసుకోవాలంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపుతున్నాయి. లంచం చట్టరీత్య నేరమైతే మీరు లంచం తీసుకోమని ఎలా చెబుతారని మండిపడుతున్నారు.

Rambai Singh

Rambai Singh : లంచం తీసుకోవడం చట్టరీత్య నేరం.. కానీ చట్టాలు చేసే ఓ ప్రజాప్రతినిధే లంచాలు తీసుకోమంటే?.. స్వచ్చందంగా లంచం ఇస్తే తీసుకోవాలి.. కానీ బలవంతపెట్టొద్దు అంటూ తాజాగా ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. మధ్యప్రదేశ్ లోని పథారియా నియోజకవర్గం నుంచి బీఎస్పీ పార్టీ నుంచి గెలుపొందిన రాంబాయి సింగ్.. లంచం గురించి చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆదివారం నియోజకవర్గంలోని సతావువా గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే రాంబాయి సింగ్ హాజరయ్యారు.

Read More : Murder At Anantapuram : తన భార్య గురించి చెడుగా చెప్పాడని.. వియ్యంకుడి హత్య

ఈ సందర్బంగా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చినంత తీసుకోవాలి.. బలవంతపెట్టొదని తెలిపింది. లంచం విషయంలో అధికారులు పేదలను దృష్టిలో ఉంచుకోవాలని తెలిపారు. అయితే లంచమే చట్టవ్యతిరేకమైతే.. అందులో తక్కువ, ఎక్కువ, ఇచ్చినంత తీసుకోవడం ఏంటని అధికార పార్టీ నేతలతోపాటు, మరికొందరు రాంబాయిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజలు రూ.500, రూ.1,000.. ఎంతిచ్చినా తీసుకోవాలే గానీ, వారివద్ద ఉన్నదంతా లాగేసుకోవాలని చూడటం తగదని హితవు పలికారు.

Read MoreRains In Telangana : తెలంగాణలో ఎల్లుండి భారీ వర్షాలు :

ఈ సమావేశాన్ని వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో వీడియో వైరల్ గా మారింది. లంచం తీసుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని దామోహ్‌ జిల్లా కలెక్టర్‌ కృష్ణ చైతన్య చెప్పారు. తన వ్యాఖ్యలను ఎమ్మెల్యే రాంబాయి సింగ్‌ సమర్థించుకున్నారు. సతావువా గ్రామ నిరుపేదలు ఎంత కష్టపడినా నెలకు రూ.6వేలు సంపాదించడం కష్టమని తెలిపారు. అటువంటి వారు ఎంతిచ్చినా తీసుకోవాలే గానీ రూ.10 వేల చొప్పున బలవంతంగా రాబట్టాలని చూడటం తగదని తాను చెప్పానన్నారు.