Malook Nagar Slams Rahul Gandhi: రాజస్థాన్‭ లాంటిది ఏమైనా ప్లాన్ చేశారా..? డానిష్ అలీని రాహుల్ గాంధీ కలవడంపై విరుచుకుపడ్డ బీఎస్పీ నేత

బీఎస్పీ అధినేత మాయావతి బీజేపీ ఎంపిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె తన పార్టీ ఎంపీని రక్షించుకుంటారు. సానుభూతి చూపినందుకు రాహుల్ గాంధీకి ధన్యవాదాలు. అయితే ఇంతకు ముందు వారు (కాంగ్రెస్) మా ఎమ్మెల్యేలను లాక్కున్నట్టు ఇప్పుడు జరగకపోవచ్చు

BSP MP Malook Nagar Slams Rahul Gandhi: బహుజన్ సమాజ్ పార్టీ నేత, ఎంపీ డినిష్ అలీపై భారతీయ జనతా పార్టీ ఎంపీ రమేశ్ బిధూరి చేసిన అవమానకర వ్యాఖ్యల దుమారం మరింత ముదురుతోంది. విపక్ష పార్టీలన్నీ ఈ అంశాన్ని లేవనెత్తుతూ బీజేపీని కార్నర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఈ వివాదంలో రాహుల్ గాంధీకి కూడా విమర్శలు తప్పలేదు. బీఎస్పీకి చెందిన ఒక నేత రాహుల్ గాంధీపై సెటైర్లు విసిరారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో చేసినట్టే ఇక్కడేదైనా ప్లాన్ వేశారా అంటూ దెప్పి పొడిచారు.

పార్లమెంటులో డానిష్ అలీపై బీజేపీ నేత వ్యాఖ్యల అనంతరం.. డానిష్ అలీ ఇంటికి స్వయంగా వెళ్లి కలిశారు రాహుల్ గాంధీ. అనంతరం అలీని కౌగిళించుకుని తన మద్దతు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి లాగారు. బీఎస్పీ టికెట్ మీద గెలిచిన వారికి హస్తం తీర్థం ఇచ్చారు. ఈ విషయాన్ని బీఎస్పీ నేత, ఎంపీ మలూక్ నగార్ గుర్తు చేస్తూ రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు.

AP BJP president Purandeshwari : వైసీపీ ప్రభుత్వం తీరుతో.. మన బిడ్డల భవిష్యత్తుకు ఉపాధి కరువయ్యే పరిస్థితి నెలకొంది

మలూక్ నగర్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ “మా పార్టీ నేతలపై రాహుల్ గాంధీ గాలాలు విసురుతున్నారు. డానిల్ అలీని కలవడంపై కృతజ్ణతలు తెలుపుతున్నాను. మా పార్టీ అధినేతపై అనేక విమర్శలు వస్తూనే ఉంటాయి. ఒకవేళ రాహుల్ గాంధీ వారిని కలవడానికి వెళ్లి ఉంటే బాగుండేది. అలీపై అవమానక వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత ఇంటికి రాహుల్ వెళ్లినా మాకు అభ్యంతరం లేదు’’ అని ఆయన అన్నారు.

మలూక్ నగర్ ఇంకా మాట్లాడుతూ “బీఎస్పీ అధినేత మాయావతి బీజేపీ ఎంపిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె తన పార్టీ ఎంపీని రక్షించుకుంటారు. సానుభూతి చూపినందుకు రాహుల్ గాంధీకి ధన్యవాదాలు. అయితే ఇంతకు ముందు వారు (కాంగ్రెస్) మా ఎమ్మెల్యేలను లాక్కున్నట్టు ఇప్పుడు జరగకపోవచ్చు. రాజస్థాన్ లో, మధ్యప్రదేశ్ లో మేము వారికి మద్దతు ఇచ్చాక కూడా మా ఎమ్మెల్యేలను అనైతికంగా లాక్కున్నారు. ఈసారి కూడా అదే చేయాలని ఆలోచిస్తున్నారా?” అని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు