AP BJP president Purandeshwari : వైసీపీ ప్రభుత్వం తీరుతో.. మన బిడ్డల భవిష్యత్తుకు ఉపాధి కరువయ్యే పరిస్థితి నెలకొంది

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు బీజేపీ వాస్తవాలు చెబితే దానిని ఖండించే క్రమంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నీ అబద్దాలు చెప్పారని, వాస్తవాలను దాచి ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నించారని పురందేశ్వరి అన్నారు.

AP BJP president Purandeshwari : వైసీపీ ప్రభుత్వం తీరుతో.. మన బిడ్డల భవిష్యత్తుకు ఉపాధి కరువయ్యే పరిస్థితి నెలకొంది

AP BJP president Purandeshwari

Updated On : September 24, 2023 / 2:43 PM IST

AP BJP president Purandeshwari : ఏపీలో అరాచక పాలన, కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఆదివారం విశాఖ పట్టణంలో బీజేపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌ల సమావేశంలో కేంద్ర స్మృతి ఇరానీ, ఎంపీ జీవీఎల్ తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. మా నాన్న ఎన్టీఆర్ అప్పట్లో మహిళలకు ఆస్తి హక్కు కల్పించారు. ఇప్పుడు మోదీ సర్కార్ వారికి సంపూర్ణ సాధికారిత కల్పించేందుకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చారని అన్నారు. అలాంటి నాయత్వంలో పనిచేయడం ఆనందంగా ఉందని పురందేశ్వరి పేర్కొన్నారు.

Nara Lokesh : యువగళం పాదయాత్రను కొనసాగించనున్న లోకేశ్

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు బీజేపీ వాస్తవాలు చెబితే దానిని ఖండించే క్రమంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నీ అబద్దాలు చెప్పారని, వాస్తవాలను దాచి ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నించారని అన్నారు. నాణ్యతలేని మద్యం విక్రయాల ద్వారా ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలు రావడం లేదు. పెట్టుబడులు లేవు.. అభివృద్ధి లేదని పురందేశ్వరి రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలన తీరుచూస్తుంటే మన బిడ్డల భవిష్యత్తుకు ఉపాధి కరువయ్యే పరిస్థితి నెలకొందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Rahul Gandhi: తెలంగాణతో సహా ఆ మూడు రాష్ట్రాల్లో విజయం కాంగ్రెస్ పార్టీదే..

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన తదితర అంశాలపై క్షేత్ర స్థాయిలో అందరికి సమాచారం ఇవ్వడమే కాకుండా, ప్రజలను ప్రభావితం చేసే శక్తి సోషల్ మీడియాకు ఉందని పురందేశ్వరి అన్నారు.