బడ్జెట్ సమయంలో ఉత్సాహంగా ప్రధాని

సార్వత్రిక ఎన్నికలకు మూడు నెలల ముందు కేంద్రప్రభుత్వం పార్లమెంట్ లో ఇవాళ(ఫిబ్రవరి-1)  ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. బడ్జెట్ ప్రసంగాన్ని లోక్ సభలో తాత్కాలిక ఆర్థికమంత్రి చదువుతున్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా ఉత్సాహంగా కన్పించారు. ప్రభుత్వ పథకాలను గోయల్ చదువుతున్న సమయంలో పదే పదే బల్లను చరుస్తూ కన్పించారు. సభలో ఉన్న మిగతా బీజేపీ సభ్యులతో సమానంగా మోడీ తన ఆనందాన్ని ప్రదర్శించారు. విపక్షాల వైపు గోయల్ చూస్తున్న సమయంలోనూ మోడీ తన సంతోష సంకేతాలను వ్యక్తపర్చారు