భారత నెట్ కు 2020-21 బడ్జెట్ లో రూ.6వేల కోట్లు కేటాయించామని మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. దీంట్లో భాగంగా భారత్ లో ప్రతి ఇంటికి ఫైబర్ నెట్ అందిస్తామని మంత్రి లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ఇంటర్నెట్ గురించి మాట్లాడుతూ..ఈ ఆర్థిక సంవత్సరంలోనే దేశంలోని లక్ష గ్రామ పంచాయతీలకు ఇప్పటికే ఫైబర్ నెట్ కనెక్షన్ అనుసంధానిస్తామని తెలిపారు.
త్వరలోనే ప్రతి ఇంటికి ఇస్తామన్నారు. దీనికి సంబంధించిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆర్థికరంగ స్వరూపాన్నే మార్చేస్తున్నాయన్నారు. కొత్త అవకాశాలను అందుకునేందుకు డేటా సెంటర్ పార్క్‌లు ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. పోటీని తట్టుకుని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు డేటా సెంటర్లు ఎంతగానో ఉపయోగపడతాయని నిర్మల స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా డేటా సెంటర్ల ఏర్పాట్లు చేస్తామన్నారు.