Building Collapsed
Building Collapsed: నిర్మాణంలో ఉన్న భవంతి కూలడంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రం బికనీర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి సమయంలో భవంతి ఒక్కసారిగా కుప్పకూలింది.
ఆ సమయంలో బిల్డింగ్ లోపల 8 మంది కార్మికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న స్థానిక అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
అయితే, భవంతి కూలడానికి గల కారణాలను పరిశీలిస్తున్నామని, భవంతి రోడ్డుకు దగ్గరగా ఉండటంతో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉందని, దానిని కాంట్రల్ చేస్తున్నామని పోలీస్ అధికారులు తెలిపారు.