Building Collapse : కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ముగ్గురు మృతి, కొనసాగుతున్న సహాయక చర్యలు

యూపీలోని మీరట్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. మూడు అంతస్తుల భవనం కూలిపోయిన ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు.

building collapses

Meerut building collapse : యూపీలోని మీరట్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. మూడు అంతస్తుల భవనం కూలిపోయిన ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. మీరట్ జిల్లా కేంద్రంలోని జనసాంద్రత అధికంగా ఉండే జాకీర్ కాలనీలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా.. సమాచారం అందుకున్న నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) బృందాలు సంఘటనా స్థలంకు చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. ఆ ప్రాంతంలో వర్షం పడుతున్నా సహాయక చర్యలు కొనసాగించి పలువురిని కాపాడారు. అయితే, ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా.. మరో ఆరుగురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. వారిని రక్షించేందుకు శిథిలాల తొలగింపు ప్రక్రియను కొనసాగిస్తున్నారు.

Also Read : Mohammed Shami : అయ్యో పాపం.. ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయిన ష‌మీ.. స్పందించిన బాలీవుడ్ న‌టుడు సోనూసూద్‌

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ దీపక్ మీనా మాట్లాడుతూ.. ఈ ప్రమాదం జరిగిన సమయంలో 14మంది శిథిలాల కింద చిక్కుకున్నారని తెలిపారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టడంతో శిథిలాల కింద చిక్కుకున్న ఎనిమిది మంది రెస్క్యూ బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయని అన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని దీపక్ మీనా చెప్పారు.