Bus runs over pregnant nurse : ఎప్పుడు ఎలాంటి ప్రమాదం వస్తుందో ఎవరూ ఊహించలేరు. అప్పటిదాక తనతో సరదాగా మాట్లాడిన భార్య కనరానిలోకాలకు వెళ్లిపోవడంతో..ఆ భర్త కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. ఐదు నెలల గర్భిణీని భర్త ఎదుటే ఓ బస్సు ఢీకొంది. తీవ్రగాయలైన ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా..మార్గమధ్యలోనే చనిపోయింది. తన కళ్లెదుటే..భార్య చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నాడు. Aroor ప్రాంతంలో Chandiroor వద్ద ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
షెల్మి పౌలస్ (33) Shelmi Paulose, సినోజ్ Shinoj దంపతులు Chandiroor లో నివాసం ఉంటున్నారు. షెల్మి చండిరూర్ లో Lakeshore Hospital లో ఆరు సంవత్సరాలుగా స్టాప్ నర్సుగా పనిచేస్తోంది. ఐదు నెలల గర్భిణీ. గురువారం ఉదయం విధులకు వెళ్లేందుకు బస్టాపు వద్దకు వచ్చారు. వచ్చిన బస్సు ఎక్కుతున్న క్రమంలో పట్టు తప్పింది.
మరలా ఎక్కడానికి ప్రయత్నిస్తున్న సమయంలో Alappuzha నుంచి వస్తున్న ఓ వ్యాన్ వేగంగా ఢీ కొట్టింది. ఆమెపై నుంచి వెళ్లిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే భర్త..అదే బస్సులో Lakeshore hospital కు తరలించారు. కానీ..అప్పటికే చనిపోయిందని వైద్యులు చెప్పడంతో భర్త రోదన వర్ణనీతతంగా ఉంది.
వ్యాన్ డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత..డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.